Congress: హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా సమీర్ వలీవుల్లా..!
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు ఇంకా నెల మాత్రమే మిగిలి ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. కానీ కాంగ్రెస్ మాత్రం ఇంకా 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇందులో ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలు ఉన్నాయి. అయితే హైదరాబాద్ సంబంధించి అభ్యర్థిగా నగర జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) చీఫ్ సమీర్ వలీవుల్లా పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. సిట్టింగ్ ఎంపీ, ఆల్ ఇండియా మజిలీస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీపై ఆయన పోటీ చేయనున్నారు.
సమీర్ వలీవుల్లా అభ్యర్థిత్వాన్ని త్వరలో ప్రకటిస్తామని హైదరాబాద్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఒకట్రెండు రోజుల్లో ప్రకటించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) సీనియర్ నేత ఒకరు అన్నారు. అంతేకాకుండా, పార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలతో పార్టీ కొద్దిగా ఇబ్బంది పడింది. ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలకు రాష్ట్ర నాయకత్వం దూరంగా ఉన్నప్పటికీ, ఇతర కాంగ్రెస్ నాయకులకు AIMIMతో ఒక విధమైన అవగాహన ఉందని వార్తలు వస్తున్నాయి.

2012లో గ్రాండ్ ఓల్డ్ పార్టీతో తెగతెంపులు చేసుకున్న అసదుద్దీన్ ఒవైసీ, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (కేసీఆర్)తో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కు దగ్గరవుతున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అభ్యర్థిత్వపై వలీవుల్లా సంప్రదించినప్పుడు స్పందించాడనికి నిరాకరించారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అది త్వరలో వెల్లడిస్తుందని చెప్పారు.
బలమైన అభ్యర్థిని పెట్టేందుకు కాంగ్రెస్ విముఖత చూపడం, హైదరాబాద్ స్థానానికి పేరును ప్రకటించడంలో జాప్యం చేయడం ఏఐఎంఐఎంతో అవగాహన ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి AIMIM ప్రత్యర్థి మజిలిస్ బచావో తెహ్రీక్ (MBT) అమ్జదుల్లా ఖాన్‌కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని ఊహాగానాలు వచ్చాయి. అయితే దీనిని కాంగ్రెస్ నేతలు కొట్టిపారేశారు.అమ్జదుల్లా ఖాన్ గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యాకుత్‌పురా స్థానంలో దాదాపు 878 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications