ఏటీఎం లావాదేవీలు.. ఎస్‌బీఐ ఆంక్షలు.. ఆ సంఖ్యను మించితే అదనపు ఛార్జీలు..!
హైదరాబాద్ : ఏటీఎం నగదు లావాదేవీలపై ఎస్‌బీఐ ఆంక్షలు విధించింది. ఈమేరకు మెట్రో నగరాల్లో ఎస్‌బీఐ ఏటీఎం ల నుంచి 5 సార్లు, ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి 3 సార్లు మాత్రమే నగదు లావాదేవీలు ఉచితంగా లభిస్తాయి. ఇతర ప్రాంతాల్లో ఎస్‌బీఐ ఏటీఎం ల నుంచి 5 సార్లు, ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి కూడా 5 సార్లు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఫ్రీ గా డ్రా చేసుకోవచ్చు.
ఒకవేళ ట్రాన్సక్షన్స్ ఈ సంఖ్యను మించిపోతే ఒక్కో అదనపు విత్ డ్రాయల్ కు 5 రూపాయల నుంచి 20 రూపాయల దాకా ఛార్జీలు వడ్డించనుంది. దీనికి మళ్లీ జీఎస్టీ అదనం. విత్ డ్రాయల్స్ కాకుండా ఇతర లావాదేవీలు (ఫ్రీ అటెంప్ట్స్ కాకుండా) అంటే మినీ స్టేట్‌మెంట్ లాంటి సేవలు పొందితే 5 రూపాయలు ప్లస్ జీఎస్టీ ఛార్జీ చేయనుంది.

అదలావుంటే సేవింగ్స్ అకౌంట్స్ లో 25వేలు సగటున నిల్వ ఉంచే ఖాతాదారులకు అదనపు ఛార్జీలు వడ్డించకుండా ఎస్‌బీఐ ఏటీఎం ల నుంచి అన్ లిమిటెడ్ ట్రాన్సక్షన్స్ చేయొచ్చు. ఇక లక్ష రూపాయల సగటు నిల్వ ఉంచే వారికి అన్ని బ్యాంకుల్లో అన్ లిమిటెడ్ ఏటీఎం లావాదేవీలు జరుపుకొనేలా అవకాశమిచ్చింది.
ఇక సాలరీ సేవింగ్స్ అకౌంట్స్ ఉన్నవారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది ఎస్‌బీఐ. ఏ బ్యాంకులో నుంచైనా అన్ లిమిటెడ్ ఏటీఎం ట్రాన్సక్షన్స్ కు అనుమతించింది.












Click it and Unblock the Notifications