హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్కూళ్లకు సెలవుల పొడగింపు..? మరో రెండు వారాలు పెంచే ఛాన్స్

|
Google Oneindia TeluguNews

కరోనా కేసులు పెరుగుతున్నాయి. పండగ సమయంలో జనం గ్రామాలకు వెళుతున్నారు. దీంతో కేసుల సంఖ్య పెరుగుతుంది. దీంతో స్కూల్స్ రీ ఓపెన్‌పై తెలంగాణ సర్కార్ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. మరో రెండు వారాలు స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తే మంచిదనే యోచనలో ఉన్నట్టు సమాచారం. రేపటితో పండుగ సెలవులు ముగుస్తాయి. ఎల్లుండి నుంచి స్కూళ్లు తెరుచుకోవాల్సి ఉంది. అయితే మరో 2 వారాలపాటు సెలవులు పొడిగించాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కూడా విద్యాశాఖ నివేదిక సమర్పించింది.

నెలాఖరు వరకు సెలవులు పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కరోనా ఆంక్షలను ఈనెల 20 వ‌ర‌కు పొడిగించింది. దీనివల్ల రోజువారీ కేసుల సంఖ్య కాస్త త‌గ్గే అవ‌కాశం ఉంటుందని భావిస్తోంది. మరోవైపు ఈ నెల చివరి వరకు కేసులు భారీగా పెరగొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో నెలాఖరు వరకు విద్యాసంస్థలు మూసివేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

school holidays may be extended another 2 weeks

ప్రైవేట్‌ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తున్నాయి. కరోనా కారణంగా ఇప్పటికే స్కూళ్లకు సర్కార్‌ సెలవులు ప్రకటించగా ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ వాటిని లెక్కలోకి కూడా తీసుకోలేదు. ఇష్టారాజ్యంగా స్కూల్స్, కాలేజీలు నడిపేస్తున్నాయి. సంక్రాంతి సెలవులు ఉన్నప్పటికీ, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్లాసులు నడుపుతున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారులకు తెలిసినా పెద్దగా పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..

ఇటు నిన్న తెలంగాణ రాష్ట్రంలో 2398 కేసులువచ్చాయి. కరోనా సోకిన ముగ్గురు చనిపోయారు. రాష్ట్రంలో 21 వేల 676 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. పండగ నేపథ్యంలో కేసులు పెరుగుతాయనే ఆందోళన మాత్రం నెలకొని ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కరోనా నిబంధనలు పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. పండుగ కాలం కావడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో కోవిడ్ ని బంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

English summary
school holidays may be extended another 2 weeks sources said. today or tomorrow education officials may be announced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X