Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Jamuna: ముగిసిన నటి జమున అంత్యక్రియలు.. తరలొచ్చిన అభిమానులు..

ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో నటి జమున అంత్యక్రియలు ముగిశాయి.

సీనియర్ సీని నటి జమున అంత్యక్రియలు అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరిగాయి. జమున కుమార్తె స్రవంతి ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వాహించారు. తల్లి చితికి నిప్పంటించారు.జమునకు కుమారుడు కూడా ఉన్నాడు. కానీ ఆయన విదేశాల్లో ఉండటంతో రావాడానికి ఆలస్యం అవుతుందని కూతురే దహన సంస్కారాలు నిర్వహించారు.

ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో, వివిధ పాత్రల్లో ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సినీ నటి జమున తన అభిమానులను, సినీ వర్గాలను కన్నీటముంచి శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. వెండి తెర సత్యభామగా ప్రేక్షకుల మనసులలో నిలిచిపోయిన జమున నటనలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

Senior actress Jamunas last rites concluded at Mahaprasthanam in Film Nagar

పౌరాణికమైనా, జానపదమైనా, సాంఘికమైనా తనకు ఇచ్చిన పాత్రలో అవలీలాగా నటించే వారు. జమున మాతృభాష తెలుగు కాకపోయినప్పటికీ తెలుగు నేలపై ఆమె ఎదిగి, సినీ పరిశ్రమలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పచుకున్నారు. 1937 కర్ణాటక రాష్ట్రంలోని హంపిలో జన్మించిన జమున, కుటుంబ సభ్యులు గుంటూరు జిల్లాకు వలస వెళ్లడంతో గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఆమె బాల్యం గడిచింది.

జమున అసలు పేరు జానాబాయి. అయితే నక్షత్రాన్ని బట్టి ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతి ఆమె పేరు మధ్యలో మూ అనే అక్షరాన్ని చేర్చి జమున అని పేరు పెట్టారు. చదువుకునే రోజుల్లోనే నాటకాలపై ఆకర్షితురాలైన జమున తమ కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉన్న నటుడు జగ్గయ్య ప్రేరణతో నాటక రంగంలోకి అడుగుపెట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+