Sridevi Drama Company: షోలో తనుకున్న కంటెస్ట్‌లు..సంచలనంగా మారిన వీడియో

ఈ రోజుల్లో సినిమాలతో పాటు సమానంగా టెలివిజన్ షోలకు ప్రజధారణ ఉందనే విషయం అందరికి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే థియోటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గిందేమో కాని..టెలివిజన్ షోలకు మాత్రం భీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా ఈ టీవీలో ప్రసారం అయ్యే ఎంటర్‌టైన్మెంట్ షోలకు మంచి స్పందన లభిస్తోంది.

 sridevi drama company show

జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ, సుమ అడ్డా, వంటి షోలు సూపర్ హిట్‌ అయ్యాయి. జబర్దస్త్ షోల్లో నటించిన చాలామంది ఆరిస్టులు సినిమాల్లో అవకాశాలు కూడా పొందారు.సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, మహేష్, షకలక శంకర్, చంటి, ఆటో రాంప్రసాద్ మొదలగు వారు జబర్దస్త్ షో ద్వారానే పాపులర్ అయి.. సినిమాల్లో నటిస్తున్నారు.

 sridevi drama company show

ఇక ఈటీవీలో ప్రసారం అయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి సపరేటు ఫ్యాన్ బేస్ ఉంది. వివిధ కళలలో నైపుణ్యం ఉన్న ఆర్టిస్టులను తెర ముందుకు తీసుకువచ్చి.. వారి టాలెంట్‌ను తమ షో ద్వారా ప్రంపచానికి చాటుతుంది. ఎంటర్‌టైన్మెంట్‌కి కెరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ షోలో అనూహ్య సంఘటన ఒకటి చోటు చేసుకుంది. షోకి వచ్చిన ఇద్దరు కంటెస్ట్‌లు తన్నుకోవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది.

 sridevi drama company show

వీరిద్దరూ కూడా సీరియల్ నటులు కావడం గమనర్హం. దేవత సీరియల్ ఫేం అర్జున్, బిగ్‌బాస్ ఫేం మానస్ వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. వీరిద్దరి మధ్య అసలు ఏం జరిగిందంటే..శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఓ టాస్క్ ఇచ్చారు... షోకి వచ్చిన అందరి ఫోన్లు ఒకచోట పెట్టి.. ఎవరో ఒకరి ఫోన్ తీసి.. వారి ఫోన్లో ఏముందో చూపించాలి. మొదట యాంకర్ రష్మీ ఫోన్ రాగా.. తన బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చూపించాలని కోరారు.

 sridevi drama company show

దాంతో ఆమె తన బ్యాలెన్స్ అమౌంట్‌ను చూపిస్తుంది. తరువాత దేవత సీరియల్ హీరో అర్జున్ వంతు రాగ...ఆయన ఫోన్ ఓపెన్ చేస్తే చాలా విషయాలు బయటపడతాయని మానస్ వెటకారం చేస్తాడు. పెళ్లైన వాడి నా ఫోన్లో ఏం దొరుకుతాయ్..నీ ఫోన్లోనే ఉంటాయని..మానస్‌కు అర్జున్ కౌంటరిస్తాడు.దీంతో అర్జున్‌పై మానస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ...నువ్వు అనవసరంగా నన్ను కెలుకుతున్నావ్ అంటూ ఫైర్ అవుతాడు. నువ్వు కూడా నాపై గతంలో చాలా షోల్లో పంచ్‌లు వేశావని..దానికి నేనేమైనా ఫీల్ అయ్యానా అంటూ మానస్‌పైకి అర్జున్ దూసుకెళ్లాడు.

మొదట అందరూ కూడా ఇదింతా సరదాగానే అని అనుకున్నారు. ఒకరిపై మరొకరు వెళ్లడంతో.. అక్కడ వాతవరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇలాంటి వాడిని షోలకు పిలవకండి అంటూ మానస్‌ను ఉద్దేశించి అర్జున్ కామెంట్ చేస్తాడు. ఎక్కువ మాట్లాడితే నీకు తగులుతాయ్ అంటూ అర్జున్ మానస్ మీదకు వెళ్తాడు.ఒకానొక దశలో ఇద్దరూ కూడా సహనం కోల్పోయి.. ఒకరినొకరు తోసుకునే వరకు వెళ్లడంతో..పక్కనే ఉన్న ఆర్టిస్టులు వారిద్దరిని వీడదీస్తారు. దీంతో గొడవసర్దుమణుగుతుంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వచ్చే ఆదివారం దీనికి సంబంధించిన ఎపిసోడ్ ప్రసారం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+