Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీఆర్ సార్.. నియోజకవర్గానికి ఒక స్టడీ సర్కిల్, టిఫిన్, లంచ్ కూడా: బండి సంజయ్

తెలంగాణలో కొలువుల కుంభవేళా.. దీనిపై రకరకాల ట్రోల్స్ అవుతున్నాయి. కాంగ్రెస్ ఏమో కానీ.. బీజేపీ క్యాడర్ దారుణంగా కామెంట్ చేస్తోంది. కానీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించారు. సీఎం కేసీఆర్ కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. గత రెండేళ్లుగా కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల వల్ల పోటీ పరీక్షల కోచింగ్ కోసం యువత పెద్దగా ఖర్చు పెట్టే పరిస్థితి లేదని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థుల కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు.

మారుమూల ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రాలకు రావడం నిరుద్యోగ యువతకు వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారమని అందులో పేర్కొన్నారు. అందువల్ల నియోజకవర్గానికి ఉచిత స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకునే విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా అల్పాహారం, భోజన సౌకర్యాలను కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

set up study circle in Constituency wise, bandi sanjay write letter to cm kcr

రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 80,039 ఖాళీలు ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. శాఖల వారీగా ఖాళీల వివరాలు.. హోం శాఖ- 18,334, సెకండరీ ఎడ్యుకేషన్- 13,086,హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్- 12,755, హైయర్ ఎడ్యుకేషన్- 7,878, బీసీల సంక్షేమం- 4,311, రెవెన్యూ శాఖ- 3,560, ఎస్సీ వెల్ఫేర్‌ శాఖ- 2,879, నీటిపారుదల శాఖ- 2,692, ఎస్టీ వెల్ఫేర్- 2,399, మైనారిటీస్ వెల్ఫేర్- 1,825, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ మరియు టెక్నాలజీ- 1,598, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ- 1,455, లేబర్, ఎంప్లాయీమెంట్- 1,221, ఆర్థిక శాఖ- 1,146, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్- 895, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్- 859, అగ్రికల్చర్, కో-ఆపరేషన్- 801, రవాణా, రోడ్లు, భవనాల శాఖ- 563, న్యాయశాఖ- 386, పశుపోషణ, మత్స్య విభాగం- 353, జనరల్ అడ్మినిస్ట్రేషన్- 343, ఇండస్ట్రీస్, కామర్స్- 233, యూత్, టూరిజం, కల్చర్- 184, ప్లానింగ్- 136, ఫుడ్, సివిల్ సప్లయిస్- 106, లెజిస్లేచర్- 25, ఎనర్జీ- 16 పోస్టులు ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+