Passport: ఇండియా పాస్ పోర్ట్ పొందిన బంగ్లాదేశ్ మహిళ.. పట్టుకున్న శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు..
మనకు పాస్ పోర్ట్ కావాలంటే ఏం చేయాలి. మొదటగా ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలి. అంతకంటే ముందు భారతీయుడై ఉండాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. అన్ని ఒకే ఉంటేనే పాస్ పోర్ట్ వస్తుంది. లేకుంటే రిజెక్ట్ అవుతుంది. కానీ ఓ బంగ్లాదేశ్ మహిళకు మాత్రం ఇండియా పాస్ పోర్ట్ వచ్చింది. ఎలా వచ్చిందో విచారణలో తేలనుంది. తాజాగా భారతీయ పాస్‌పోర్ట్‌తో సహా మోసపూరిత గుర్తింపు పత్రాలను పొందినందుకు బంగ్లాదేశ్ మహిళను హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ (RGI) విమానాశ్రయంలో పట్టుకున్నారు.
నిందితురాలిని సోనాలి బల్లవ్‌గా గుర్తించారు. 29 ఏళ్ల సోనాలి బల్లవ్ అక్టోబర్ 16న ఒమన్‌లోని మస్కట్ నుంచి 6E-1274 విమానంలో ఇండియాకు తిరిగి వస్తుండగా అరెస్ట్ చేశారు. హైదరాబాద్ విమానాశ్రయంలోని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అధికారికి సాధారణ ఇమ్మిగ్రేషన్ తనిఖీల్లో సోనాలి గుర్తింపుపై అనుమానం వచ్చింది. దీంతో ఆమెను విచారించారు. చివరికి ఆమె భారతీయ పౌరురాలు కాదని తెలిసింది. బంగ్లాదేశ్‌లోని మానిక్‌గంజ్ సదర్‌కు చెందిన సోనాలి అనే బంగ్లాదేశ్ జాతీయురాలు అని అధికారులు గుర్తించారు.

సోనాలి 2015లో పశ్చిమ బెంగాల్‌లోని పెట్రాపోల్-బెనాపోల్ సరిహద్దు ద్వారా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించింది. అక్కడి నుంచి ఢిల్లీకి చేరింది. ఢిల్లీలోని పాండవ్ నగర్‌లో స్థిరపడింది. కొద్ది రోజుల తర్వాత ఆమె భారతీయ పౌరుడు లక్ష్మీ కాంత్ బల్లవ్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, భారతీయ పాస్‌పోర్ట్‌తో సహా కీలకమైన గుర్తింపు పత్రాలను కూడా మోసపూరితంగా పొందింది.
మహిళ తన సాధారణ నివాస స్థలం అయిన ఢిల్లీకి బదులుగా హైదరాబాద్‌ను తన ఎంట్రీ పాయింట్‌గా ఎంచుకుంది. ఇలా చేస్తే అధికారులు గుర్తించే అవకాశం లేదని భావించిన అధికారులు అనుమానిస్తున్నారు. అయితే హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమె గుర్తింపుపై అనుమానం వ్యక్తం చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది.












Click it and Unblock the Notifications