షైన్ ఆస్పత్రి ఎండీ అరెస్ట్.. కోర్టు నుంచి రిమాండ్‌కు.. మరో నలుగురిపై కేసు
నాలుగు నెలల చిన్నారి మృతికి కారణమైన షైన్ హాస్పిటల్ ఎండీ సునీల్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్నామనే అంశంపై గోప్యత పాటించారు. కోర్టులో హాజరుపరిచి.. రిమాండ్‌లోకి తీసుకున్నారు. సునీల్‌తోపాటు మరో నలుగురిపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలో ప్రమాదానికి సంబంధించి వైద్యశాఖ అధికారులు పూర్తి నివేదిక అందజేసిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి యాజమాన్యానిదే తప్పని నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది
ఈ నెల 21న షైన్ ఆస్పత్రి ఐసీయూలో అగ్నిప్రమాదం జరిగింది. ఐసీయూలో పొగలు వ్యాపించాయి. అక్కడ ఐదారుగురు చిన్నారులు చికిత్స పొందుతున్నారు. పొగతో ఊపిరాడక నాలుగు నెలల చిన్నారి మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అధికారులు హుటహుటిన తనిఖీలు చేపట్టారు. వైద్యాధికారులు నివేదిక రూపొందించి ఆస్పత్రి యాజమాన్యానిదే తప్పని తేల్చినట్టు సమాచారం. షైన్ ఆస్పత్రి ఎండీ సునీల్ కుమార్, మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించి శుక్రవారం సునీల్‌ను రిమాండ్‌లోకి తీసుకొని విచారిస్తున్నారు.

షైన్ ఆస్పత్రిలో అగ్రిప్రమాదం జరగడం ఇదే తొలిసారి కాదనే అంశం వెలుగులోకి వచ్చింది. ఇదివరకు కూడా ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. సరైన చర్యలు తీసుకోకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఘటనపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు నగరంలో ఉన్న ఆస్పత్రులపై దృష్టిసారించారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించని 350 ఆస్పత్రులకు నోటీసులు కూడా జారీచేశారు.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications