బిగ్‌బాస్ వలలో దారుణంగా చిక్కుకుని విలవిల్లాడుతున్న తీన్‌మార్ సావిత్రి?
హైదరాబాద్: ఎవరు చేసిన ఖర్మను వారే అనుభవించాలనే సూక్తి.. ప్రస్తుతం శివజ్యోతి అలియాస్ సావత్రి విషయంలో నిజమౌతోంది. ఎవరి ప్రవర్తనైతే ఏ మాత్రం బాగోలేదంటూ ఆమె బిగ్‌బాస్‌కు రిపోర్ట్ ఇచ్చి, శతృత్వాన్ని కొని తెచ్చుకున్నారో.. ఇప్పుడు వాళ్ల చేతుల్లోనే సావిత్రి భవితవ్యం ఆధారపడింది. సావిత్రి చివరి వరకూ బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగాలంటే ఆ ఆరుమంది దయాదాక్షిణ్యాలు చూపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అకారణంగా- తాను ఎలిమినేషన్ కోసం ఇచ్చిన ఆరు పేర్లు.. ఇప్పుడు ఆమెకు బూమరాంగ్ అయ్యాయి. తాను ఎలిమినేషన్ కోసం ఎంపిక చేసిన ఆరుమందిలో ఏ ఒక్కరైనా సావిత్రికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చారూ అంటే ఇక ఆమె జర్నీ అక్కడే ఖతమౌతుంది. అలాంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు సావిత్రి.

అసలు కథేమిటంటే..
బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన ఇతర కంటెస్టెంట్ల వ్యక్తిగత ప్రవర్తనపై రిపోర్ట్ ఇవ్వాలంటూ బిగ్‌బాస్ సావిత్రితో పాటు రవికృష్ణ, అషూరెడ్డిలకు ఓ టాస్క్ ఇచ్చారు. దీనికి అనుగుణంగా వారు ఆయా కంటెస్టెంట్లతో మాట్లాడిన అనంతరం- వారి ప్రవర్తనపై ఓ రిపోర్ట్ రూపొందించి బిగ్‌బాస్‌కు అప్పగించారు. ఇందులో సావిత్రి ఇచ్చిన రిపోర్ట్ కాస్త ఘాటుగా ఉంటుంది. ఈ ముగ్గురి రిపోర్ట్‌ను ఆధారంగా చేసుకుని- ఈ వారం హౌస్ నుంచి బయటకి వెళ్లిపోయే ప్రక్రియకు ఆరుగురిని ఎంపిక చేశారు. రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్, ఆయన భార్య వితిక, బాబా భాస్కర్, శ్రీముఖి, జాఫర్ బాబులను నామినేట్ చేశారు బిగ్‌బాస్. ఎలిమినేషన్ నుండి తప్పించుకోవడానికి ఆ ఆరుమందికీ బిగ్‌బాస్ ఓ చివరి అవకాశాన్ని కల్పించారు.

హేమ చేతిలో.. సావిత్రి భవితవ్యం
ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన ఆ ఆరుమందీ మిగిలిన హౌస్‌మేట్స్ నుంచి ఒక కంటెస్టెంట్‌ను ఎంపిక చేసి, ఆ కంటెస్టెంట్‌ను ఈ గేమ్ నుంచి ఎలిమినేట్ చేయడానికి వీలు కల్పించారు బిగ్‌బాస్. అక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. సరైన కారణాలను చూపించి, ఆ కంటెస్టెంట్‌ను ఎలిమినేషన్ కోసం నామినేట్ చేయోచ్చనేది ఈ టాస్క్. ఈ ప్రక్రియ మొత్తాన్నీ పర్యవేక్షించడానికి మరో సూపర్‌వైజర్‌గా మరో కంటెస్టెంట్‌ను ఎన్నుకోవచ్చనే ఆప్షన్ ఇచ్చారు బిగ్‌బాస్. దీనితో ఆ ఆరుమందీ నటి హేమను మెంటార్‌గా ఎన్నుకున్నారు. హేమ పర్యవేక్షణలో ఈ ఆరుమంది ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడానికి టాస్క్‌లోకి దిగారు. ఈ క్రమంలో- ఎలిమినేషన్‌ను ఎదుర్కొంటున్న ఆరుమందికి కూడా సావిత్రిపై ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి అవకాశం చిక్కినట్టయింది. చివరగా- వారు ఎలాంటి రిపోర్ట్ ఇచ్చినప్పటికీ.. ఎలిమినేట్ చేయాలా? వద్దా? అని తేల్చాల్సింది మాత్రం హేమ. ప్రస్తుతం ఈ టాస్క్ మొత్తానికీ హేమ కీరోల్ ప్లే చేస్తున్నారు.

ఆత్మరక్షణలో సావిత్రి..
అనూహ్యంగా బిగ్‌బాస్ వేసిన వలలో చిక్కుకున్నారు సావిత్రి. దీనితో ఆమె ఆత్మరక్షణలో పడినట్టు కనిపిస్తున్నారు. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో.. ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటున్నారు. తాను ఎందుకు రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్, ఆయన భార్య వితిక, బాబా భాస్కర్, శ్రీముఖి, జాఫర్ బాబులను ఎలిమినేషన్‌కు ఎంపిక చేయాల్సి వచ్చిందనే విషయాన్ని వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా- సోమవారం నాటి ఎపిసోడ్‌లో టెలికాస్ట్ అయింది. తాను ఎలాంటి దురుద్దేశంతో ఎలిమినేషన్‌కు ఎంపిక చేయలేదని వివరణ ఇచ్చుకున్నారు. టాస్క్‌కు మాత్రమే తాను పరిమితమై పేర్లను ఎంపిక చేయాల్సి వచ్చిందని చెప్పారు.

హేమకు కూడా ఇబ్బందే..
ఎలిమినేషన్‌ను ఎదుర్కొంటున్న సభ్యుల్లో నుంచి కూడా ఒకరిని రక్షించే అవకాశం హేమకు ఇవ్వడం ట్విస్ట్. ఆ ఆరుమందిలో ఒకరిని ఎందుకు ఎలిమినేషన్ నుంచి రక్షించారనే అంశంపై హేమ సహేతుకమైన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఏ ఒక్కర్ని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ.. మిగిలిన వారికి శతృవుగా మారే ప్రమాదం హేమకు పొంచివుంది. ఫలానా కంటెస్టెంట్‌నే ఎందుకు రక్షించారనే ప్రశ్న తోటి హౌస్‌మేట్స్ నుంచి ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. దీనితో హేమ పరిస్థితి కూడా కత్తిమీద సాములాగే తయారైంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications