7 వేల మంది పోలీసులతో భద్రత, షీ టీమ్స్ కూడా.. ప్రశాంతంగా శోభాయాత్ర: సీపీ సీవీ ఆనంద్

శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్‌లో శోభాయాత్ర జరుగుతుంది. శోభాయాత్ర ప్రశాంతంగా జరుగుతుందని హైదరాబాద్ పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. బషీర్ బాగ్ పోలీసు కమీషనర్ కార్యాలయంలో జరిగిన మీడియాతో మాట్లాడారు. కరోనా వల్ల రెండేళ్లు శోభాయాత్ర జరగలేదని చెప్పారు. కార్యకర్తలు శోభాయాత్రలో పాల్గోనేందుకు ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. వారం క్రితం అన్ని శాఖల అధికారులతో సమావేశం అయ్యాయని తెలిపారు.

సౌత్ జోన్ నుంచి కూడా శోభాయాత్ర వస్తుందని, నగరంలోని మిగతా ఏరియాలలో ఎక్కడి నుంచి శోభాయాత్ర నిర్వహించవద్దని కోరారు. రాత్రి 8 గంటలకు పూర్తవుతుందని అంచనా వేశారు. శోభాయాత్ర మొత్తాన్ని సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని ఆయన తెలిపారు. సిటీకి చెందిన 6 వేల మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వెయ్యి మంది కలిపి 7 వేల మంది పోలీసులు శోభాయాత్ర విధులు నిర్వహిస్తున్నారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ఉన్నాయని వివరించారు. సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టిసారించామని సీవీ ఆనంద్ చెప్పారు.

shobha yatra to complete peacefull:city cp cv anand

హైదరాబాద్ లోని సీతారాం బాగ్ నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. హనుమాన్ వ్యయమశాల వరకు 6.5 కి.మీటర్లు కొనసాగుతుంది. శోభాయాత్రలో భారీ హనుమంతుడు, భరతమాత, ఛత్రపతి శివాజీ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ధూల్ పేట్, జాలీ హనుమాన్, చుడీ బజార్, గౌలి గూడ, మీదుగా హనుమాన్ టేకీడీ లోని హనుమాన్ వ్యయామశాల వరకు శోభాయాత్ర జరగుతుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించారు.

భైంసాలో గోపాలదాస్ హనుమాన్ ఆలయం, పాత సోనా చాందినీ, కుబేర్ అడ్డా, బస్టాండ్, నిర్మల్ చౌరస్తా, రాంలీలా మైదాన్ మీదుగా ఊరేగింపు జరుగుతుంది. పోలీసు బందోబస్త్ మధ్య శోభాయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. రెండు చోట్ల శోభాయాత్ర ప్రశాంతంగా జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+