Disha murder: 'దిశ'ను బతికుండగానే కాల్చేశారు !! దిశ గ్యాంగ్ రేప్ ,హత్య కేసులో కొత్త కోణం
షాద్ నగర్ సమీపంలో జరిగిన వెటర్నరీ వైద్యురాలి గ్యాంగ్ రేప్, హత్య కేసును పోలీసులు త్వరిత గతిన ఛేదించారు. నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది . ఇక వారిని తిరిగి విచారించాలని ఇంకా ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు చెయ్యాలని నిందితులను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేసిన నేపధ్యంలో కోర్టు 10 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది . ఇక తాజాగా ఈ కేసులో మరోమారు పోలీసుల విచారణ కొనసాగుతున్న సమయంలో నలుగురు మృగాళ్ళు చేసిన మరికొన్ని దారుణాలు వెలుగులోకి వచ్చాయి.
బహిరంగంగా ఉరితీయండి: మహిళా వైద్యురాలి ఘటనపై ఉమర్ అహ్మద్ ఇల్యాసి

జైల్లో మృగాళ్ళ సంభాషణ ద్వారా వెలుగులోకి కొత్త విషయాలు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న దిశ హత్య ఘటనలో మరికొన్ని దారుణ నిజాలు బయటకు వచ్చాయి. అయితే నలుగురు మృగాళ్ళు దిశ అపస్మారకస్థితిలో ఉన్నప్పుడే పెట్రోల్ పోసి తగటబెట్టారని తాజాగా జైల్లో వారి సంభాషణ ద్వారా తెలుస్తుంది.చనిపోయిన తరువాత కాదు దిశను బ్రతికి ఉండగానే సజీవ దహనం చేశారన్న విషయం వారి మాటల ద్వారా గుర్తించారు జైలు సిబ్బంది .

జైలు కాపలాదారునికి ఏం చేశారో చెప్పిన ప్రధాన నిందితుడు ఆరిఫ్
ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా జైలు కాపలాదారుని దగ్గర ఈ విషయాన్ని చెప్పాడు ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరిఫ్. ప్రస్తుతం దిశ హత్య కేసు నిందితులు నలుగురు చర్లపల్లి జైలులో, ప్రత్యేక నిఘాలో ఉన్నారు. వీరికి కాపలా కాస్తున్న కొంతమంది సిబ్బంది తాజాగా వారి మానసిక స్థితి అంచనా వెయ్యటానికి వారితో మాటలు కలిపిన క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జైలులో ఉన్నా వీరిలో ఏ మాత్రం తప్పు చేశామన్న భావం లేకపోవటం సిబ్బంది గుర్తించారు.

లిక్కర్ నోట్లో పోయటంతో అపస్మారక స్థితిలో ఉన్న దిశపై గ్యాంగ్ రేప్
ప్రధాన నిందితుడు ఆరిఫ్ చెప్తున్న ప్రకారం ఒక్కొక్కరు ఒకసారి కాదు, రెండు సార్లు దిశపై అత్యాచారానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. దిశను బలవంతంగా కాళ్లు, చేతులు పట్టుకొని అత్యాచారం చేసిన సమీప ప్రాంతానికి నలుగురు లాక్కెళ్తున్నప్పుడు ఆమె పెద్దగా అరిచి కేకలు వేసింది. మళ్లీ ఆమె కేకలు వేయకుండా చెన్నకేశవులు తన జేబులో ఉన్న లిక్కర్ సీసాను తీసి దిశ నోట్లో బలవంతంగా పోశాడు. అప్పటికే భయంతో, టెన్షన్‌తో ఉన్న దిశ లిక్కర్ నోట్లో పోయటంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది.

అపస్మారక స్థితిలోనే ఉన్న దిశను సజీవ దహనం చేసిన నిందితులు
వెంటనే ఆమెపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు.ఆ తరువాత ప్రాణాలతోనే ఉన్న దిశను లారీ ఎక్కించి అందులో కూడా అత్యాచారం చేశారు. దీంతో ఆమె పూర్తిగా అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో ఆమె చనిపోయిందని భావించి పూర్తిగా నిశ్చేతనంగా ఉన్న దిశను చటాన్‌పల్లి వంతెన దగ్గరకు తీసుకువచ్చి బతికుండగానే పెట్రోల్ పోసి తగలబెట్టారని ఆరిఫ్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక వీరిని 10 రోజుల పాటు పోలీసులు విచారించనున్న నేపధ్యంలో ఇంకెన్ని దారుణాలు వెలుగు చూస్తాయో .
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!