TSPSC పేపర్ లీక్ కేసులో ముగిసిన నిందితుల కస్టడీ.. చివరికి ఏం తేలిందంటే.!
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ(TSPSC) పేపర్ లీక్ కేసులో సిట్ నిందితులను కోర్టులో హాజరుపరిచింది. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, డాక్యా, రాజేశ్వర్ సిట్ కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో హాజరుపరిచే ముందు కోటిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. పేపర్ లీక్ కేసులో సిట్ ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేసింది. ఈ కేసు విచారణకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.
రాజశేఖర్ సమీప బంధువు న్యూజిలాండ్ లో ఉండే ప్రశాంత్ రెడ్డిపై సిట్ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. రాజశేఖర్ గ్రూప్-1 పేపర్ ను ప్రశాంత్ రెడ్డికి వాట్సాప్ షేరు చేశాడు. ప్రశాంత్ న్యూజిలాండ్ నుంచి వచ్చి గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసి వెళ్లిపోయాడు. పేపర్ లీక్ వ్యవహారం బయటపడడంతో అతనిపై లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. గ్రూప్-1, ఏఈ పేపర్ల లీక్ తో ఈ రెండు పరీక్షలను టీఎస్సీపీఎస్సీ రద్దు చేసిన విషయం తెలిసిందే.

పేపర్ లీక్ కేసులో గ్రూప్-1 100 మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వారిని సిట్ విచారిస్తుంది. వారికి నిపుణులతో తయారుచేయించిన ప్రశ్న పత్రంతో పరీక్ష పెట్టి వారి సామార్థ్యాన్ని తెలుసుకుంటుంది. 100కు పైగా మార్కుల వచ్చిన 121 మందిలో ఇప్పటికే 53 మందిని విచారించింది. ఏఈ పేపర్ లీక్ చేసినందుకు ప్రవీణ్ రూ.10 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. అడ్వాన్స్ రూ.5 లక్షలు, తర్వాత మరో రూ.5 లక్షలు ప్రవీణ్ ఇచ్చిన రేణుక దంపతులు ఒప్పుకున్నట్లు సమాచారం.

రేణుక ఫిర్యాదు చేసేందుకు టీఎస్పీఎస్సీ ఆఫీస్ కు రాగా ప్రవీణ్ తో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇక నుంచి ఫిర్యాదులను ఆన్ లైన్ లో తీసుకోవాలని నిర్ణయించింది. ఉద్యోగులు ఎవరూ ఆఫీస్ లోకి పెన్ డ్రైవ్ లు తీసుకెళ్లొద్దని ఆదేశించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications