జూబ్లీహిల్స్ రేప్ కేసు: మైనర్ల పైశాచికం.. టాటు మాదిరిగా ఉంటుందని కొరికారట
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో పూటకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. ఇప్పటికే సీన్ రీ కన్‌స్ట్రక్ట్ చేయగా.. బాధితురాలి మెడికల్ రిపోర్ట్ కీలకంగా మారింది. బాలిక శరీరంపై 12 గాయాలు ఉన్నాయని. దీనిపై నిందితులను పోలీసులు ఆరా తీశారు. బాలిక మెడపై తీవ్రంగా కొరకడం, రక్కడంతో గాయాలు అయ్యాయి. బాలిక మెడపై టాటూలా ఉండాలనే, మెడపై కొరికినట్లు నిందితులు తెలుపడం విశేషం. ఆరుగురు నిందితులను ఏసీపీ విచారిస్తోన్నారు. కేసు విచారణ కోసం ఫాస్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కొందరు కోరుతున్నారు.

రంగంలోకి ఏసీపీ సుదర్శన్
ఆరుగురు నిందితులను జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్‌లో ఏసీపీ సుదర్శన్ విచారిస్తున్నారు. మరో సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫుటేజిలో ఎరుపు రంగు బెంజి కారులో మైనర్ బాలిక బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి ప్రయాణిస్తన్న ఆధారాలు దొరికాయి. నిన్న ముగ్గురు మైనర్లను ఓ మేజర్‌ను గంటపాటు ఇంటరాగేట్ చేశారు.

పరిచయం నుంచి..
పబ్‌లో బాలికను పరిచయం చేసుకునప్పటి నుండి ట్రాప్‌లోకి దించడం, అత్యాచార ఘటన, మరుసటి రెండు రోజుల వరకు ఏం జరిగింది, ఎక్కడికి పరార్ అయ్యారు, ఎవరి సహాయంతో రాష్ట్రం దాటారు.. ఇలా అనేక కోణాల్లో విచారిస్తున్నారు. సాదుద్దీన్ మాలిక్ కస్టడీ విచారణ ఇవాళ్టితో ముగియనుంది. నిందితుల నుంచి కీలకమైన సమాచారం సేకరించే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు.

పైశాచిక ఆనందం
వారు చూడటానికే మైనర్లు.. కానీ వారిలో విశృంఖల మనస్తత్వం.. బాలికపై లైంగకదాడి చేయడమే కాదు.. మెడపై కొరికి తమ పైశాచికత్వాన్ని చాటుకున్నాు. మెడపై కొరడకం, ఇతర చోట్ల రక్కి.. రాక్షస ఆనందం పొందారు. అందుకే ఆ బాలిక అంతలా భయపడింది. జరిగిన ఘటన గురించి పేరంట్స్‌కు చెప్పలేకపోయింది. వైద్యుల వద్ద కూడా నోరు మెదపలేదు. కానీ కౌన్సిలింగ్ ఇస్తే.. నోరు తెరిచింది. జరిగిన దారుణం గురించి తెలియజేసింది. ఇలా ఆ ఆరుగురి ఉన్మాద చర్య బయట పడింది. గెట్ టు గెదర్ అని పార్టీకి వెళితే.. దారుణంగా లైంగికదాడికి గురయ్యింది.












Click it and Unblock the Notifications