సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య..? భర్తతో గొడవ.. ఎఫైర్ ఉందని తెలిసి మనస్థాపం, అల్లుడే..
భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్తే వేధించడంతో బరించలేకపోయింది. మరో అమ్మాయితో క్లోజ్‌గా ఉండటం.. విషయం తెలిసి ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి గొడవ జరిగింది. తన తీరు మార్చుకోబోనని.. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్ అంబర్‌పేటలో దారుణం జరిగింది. సాప్ట్వేర్ ఉద్యోగి శివానీ ఆత్మహత్య చేసుకుంది. భర్త సుకిత్ మరో అమ్మాయితో చనువుగా ఉండటం జీర్ణించుకోలేకపోయింది. ఈ విషయమై వారి మధ్య శుక్రవారం కూడా గొడవ జరిగింది. శివానీ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కానీ ఆమె కుటుంబసభ్యులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శివానీని భర్తే హతమర్చి.. హత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. సుకిత్పైనే తమకు అనుమానం ఉందని ఫిర్యాదు చేశారు.
సుకిత్, శివానీ ఇద్దరు సాప్ట్వేర్ ఉద్యోగులు. వారిద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఐదేళ్ల క్రితం బంధం ముడిపడింది. కానీ ఆరునెలల నుంచి సుకిత్ ప్రవర్తన మారిపోయింది. గమనించిన శివానీ.. మరో అమ్మాయితో ఎఫైర్ ఉందని గుర్తించింది. ఈ విషయమై ఆరా తీసింది. తన తీరు మార్చుకోబోనని.. పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పడంతో షాక్ తిన్నది. ఈ విషయాన్ని శుక్రవారం తన సోదరికి తెలిపింది. రాత్రి భర్తతో గొడవ జరిగింది. ఆ తర్వాత విగతజీవిగా మారడంతో.. ఏం జరిగిందోనన్న సందేహాలు తలెత్తుతున్నాయి. కానీ శివానీ పేరెంట్స్ మాత్రం ముమ్మాటికీ హత్యేనని చెప్తున్నారు.