వామ్మో.. వీరేం దొంగల్రా నాయనా.. సాప్ట్‌వేర్ శారద కూరగాయాలు చోరీ, రాత్రికి రాత్రే రూ.5 వేల..
సాప్ట్ వేర్ శారద.. లాక్ డౌన్ వల్ల ఉద్యోగం పోయి, కూరగాయాలు విక్రయిస్తూ కుటుంబం నడుపుతోన్న ధీర వనిత. ఆమె గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టడంతో ప్రపంచానికి తెలిసింది. దీంతో నటుడు సోనూ సూద్ స్పందించి ఉద్యోగం కూడా ఇచ్చాడు. ఇంతవరకు ఓకే.. కానీ ఆమె కూరగాయలను కేటుగాళ్లు కొట్టేశారు. కుటుంబాన్ని నడిపేందుకు విజిటేబుల్స్ విక్రయిస్తుంటానని.. తన కూరగాయాలు దొంగిలించడంపై ఆమె ఆందోళన చెందుతున్నారు.
శారద శ్రీనగర్ కాలనీ ఫుట్‌పాత్‌పై కూరగాయాలు విక్రయిస్తున్నారు. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి కూడా అమ్మేసి.. ఇంటికెళ్లిపోయారు. కానీ మరునాడు వచ్చి చూస్తే తన కూరగాయాలు లేవు. రోజు లాగానే విజిటేబుల్స్ విక్రయించిన తర్వాత కవర్ కప్పి వెళతానని చెప్పారు. కానీ వచ్చి చూసేసరికి లేవు అని వాపోయింది. వాటి విలువ రూ.5 వేలు అని చెప్పింది. ఉద్యోగం కోల్పోయిన తర్వాత కూరగాయాలు విక్రయించి.. కుటుంబం గడుపుతున్నామని.. కానీ కూరగాయాలు దొంగిలించడం బాధాకరమని చెప్పారు.

కరోనా వైరస్ వల్ల విధించిన లాక్ డౌన్ మార్కెట్ కుదేలైపోయింది. సంస్థలు సరైన పని లేకపోవడంతో తమ సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి. అలా శారద సాప్ట్ వేర్ ఇంజినీర్ కానీ, ఉద్యోగం కోల్పోయింది. కానీ ఆమె కుంగిపోలేదు... బతకడానికి ఏదో ఒక పని చేసుకోవాలని అనుకొంది. కూరగాయాలు అమ్ముతూ తన ఇంటిని గడుపుతోంది. ఇంకేముంది కూరగాయాలు విక్రయిస్తూ జీవిస్తోన్న టెకీ అనే వార్త సోషల్ మీడియాలో జోరుగా వైరలైంది. ఈ విషయం కాస్తా మన హీరో సోనూసూద్ వద్దకు చేరడంతో ఆయన ఉద్యోగం ఆఫర్ చేశారు. కానీ కొందరు కేటుగాళ్లు ఆమె కూరగాయాలను దొంగిలించి.. ప్రపంచ ముదుర్లం అని అనిపించుకున్నారు.
Recommended Video
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications