Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Hyderabad: హైదరాబాద్ రెస్టారెంట్లలో తింటున్నారా.. అయితే ప్రమాదమే..!

హైదరాబాద్ లోని కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లు దారుణంగా మారాయి. వినియోగదారులకు అపరిశుభ్ర ఆహారాన్ని అందిస్తున్నాయి. జూన్ 12 రోజు ఓ కుటుంబం నిజాంపేట ఎక్స్ రోడ్ లోని ఓ రెస్టారెంట్ కు వెళ్లారు. స్పెషల్ చికెన బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. బిర్యానీ వచ్చింది. ఆహారం వాసన వస్తుందని వారు చెప్పారు. కానీ యాజమాన్యం మాత్రం తాజా చికెన్ అని వాదించింది. అందులో పని చేసే ఉద్యోగులను కస్టమర్లుగా చూపిస్తూ ఆ ఆహారాన్ని వారికి ఇచ్చింది. వారు దాన్ని బాగానే ఉంది కదా అని చెప్పారు.

వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారు వేరే బిర్యానీ తీసుకొచ్చారు. ఇలా సిటీలో చాలా రెస్టారెంట్లు మోసాలకు పాల్పడుతున్నాయి. దీంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. హైదరాబాద్‌లోని రెస్టారెంట్లు, హాస్టళ్లు, పీజీలు (పేయింగ్ గెస్ట్ హాస్టల్‌లు) తెలంగాణ ఆహార భద్రతా శాఖ తనిఖీలు చేసింది. జూన్ 16 ఆదివారం మాదాపూర్ ప్రాంతంలో దాడులు జరిగాయి. ఉన్నత స్థాయి ప్రాంతంలో అధికారులు వివిధ ఆహార భద్రత, పరిశుభ్రత ఉల్లంఘనలను కనుగొన్నారు. కావూరి హిల్స్‌లోని శ్రీ లక్ష్మి పీజీ హాస్టల్‌లో, ఏ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ లేకుండా ఈ సదుపాయం నిర్వహిస్తున్నట్లు డిపార్ట్‌మెంట్ గుర్తించింది.

Some restaurants and hotels in Hyderabad are serving unhygienic food

కూరగాయలు (కాలీఫ్లవర్, లేడీఫింగర్) పాడైపోయినట్లు గుర్తించారు. దోసె పాన్ తుప్పు పట్టినట్లు గుర్తించారు. పని ప్రదేశం అపరిశుభ్రంగా ఉందని గమనించారు.
మాదాపూర్‌లోని వీజీ హోమ్‌స్టేలో ఈ స్థలం కూడా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ లేకుండా నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారురు. మాదాపూర్‌లోని నారాయణ సొసైటీలోని సై నెం. 11/20లో గడువు ముగిసిన ఉత్పత్తులు కనిపించాయి.

గడువు ముగిసిన వైట్ గ్రేవీ (2 కిలోలు), చాప్ మసాలా (2 కిలోలు) దొరికాయి. సిబ్బందిలో ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ (FOSTAC) సూపర్‌వైజర్ లేరు. దోసె పాన్ అపరిశుభ్రంగా, తుప్పు పట్టినట్లు గుర్తించారు. వంటగది ప్రాంతంలో అనేక పరిశుభ్రత సమస్యలను గమనించారు. "ఉద్యోగులలో FOSTAC సూపర్‌వైజర్ లేరు. నీటి డిస్పెన్సర్‌లు తుప్పు పట్టినట్లు గుర్తించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+