కాల్పుల కలకలం: పోయిన మరో ప్రాణం, శ్రీనివాస్ తర్వాత రఘు కూడా మృతి, మట్టారెడ్డే..?
భూ వివాదంతో ఉదయం జరిగిన కాల్పుల్లో మరొకరు చనిపోయారు. ఘటనా స్థలంలో శ్రీనివాస్ రెడ్డి చనిపోగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రఘు మృతిచెందాడు. వీరి మధ్య భూ వివాదం ఉందని తెలిసింది. శ్రీనివాస్ బంధువుల ఫిర్యాదుతో పోలీసులు ఇప్పటికే మట్టారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గల కర్ణంగుడాలో ఉదయం కాల్పుల కలకలం రేగిన సంగతి తెలిసిందే.

మట్టారెడ్డే..?
శ్రీనివాస్‌రెడ్డిని హతమార్చింది మట్టారెడ్డి అని మృతుడి ప్రధాన అనుచరుడు కృష్ణ ఆరోపించాడు. శ్రీనివాస్‌రెడ్డికి, మట్టారెడ్డికి మధ్య భూవివాదం ఉందన్నాడు. 5 నెలల క్రితం ల్యాండ్ కొన్నారని.. శ్రీనివాస్‌రెడ్డి, రఘురెడ్డి ఇద్దరూ స్నేహితులు.. కలిసి వెంచర్ డెవలప్ చేస్తున్నారని వివరించాడు. 10 ఎకరాల ల్యాండ్ విషయంలో వివాదం నడుస్తోందని కృష్ణ చెప్పాడు. మొత్తం 22 ఎకరాల వెంచర్‌లో పట్టాదారులకు శ్రీనివాసరెడ్డికి గతంలోనే వివాదం ఉందని... ఇందులో కొంత భాగం నాదని మట్టారెడ్డి ఇన్వాల్వ్ అయ్యాడని కృష్ణ వివరించాడు. శ్రీనివాసరెడ్డి డ్రైవర్ మహ్మదుల్లా హఫీజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఫ్యామిలీ కూడా అతనిపై అనుమానం
శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు కూడా మట్టారెడ్డిపైనే అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు మట్టారెడ్డిని అదుపులోకితీసుకుని విచారిస్తున్నారు. కాల్పుల ఘటనలో బుల్లెట్ తూటా తగిలి బీఎన్ రెడ్డి నగర్‌లో గల ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుున్న రఘు కూడా మృతి చెందాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే శ్రీనివాస్ రెడ్డి 20 ఎకరాల భూమిలో తనకు కూడా వాటా ఉందని మట్టారెడ్డి వివాదం సృష్టించాడు. తన వాటా ఇవ్వాలని.. గత కొంతకాలంగా మట్టారెడ్డి బెదిరిస్తున్నాడట. సోమవారం మట్టారెడ్డి ఫోన్ చేసి బెదిరించాడని శ్రీనివాస రెడ్డి వద్ద సూపర్ వైజర్ గా పనిచేసే హఫీజ్ చెబుతున్నాడు. మట్టారెడ్డి వనస్థలిపురంలో ఉంటాడని హఫీజ్ తెలిపాడు.

మరొకరు మృతి
రియల్ ఎస్టేట్ వ్యాపారులు శ్రీనివాస్ రెడ్డి, రఘురెడ్డిపై దుండగులు తుపాకీతో కాల్పులు జరిపడం ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాల్పుల్లో శ్రీనివాస్ రెడ్డి మృతి చెందగా.. గాయాలతో ఉన్న రఘురెడ్డిని స్థానికులు గుర్తించారు. తనపై కాల్పులు జరిగినట్టు రఘురెడ్డి స్థానికులకు చెప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాధితుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయిన ఫలితం లేకుండా పోయింది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications