గుంటూరు కారం సినిమా లేనట్లే?

మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం రూపుదిద్దుకుంటోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, చినబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇంతవరకు బాగానే ఉందికానీ.. గతంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో షూటింగ్ జరుపుకునే ఏ సినిమాకు రానన్ని ఆటంకాలు ఈ చిత్రానికి ఎదురవుతున్నాయి.

వాస్తవానికి గుంటూరు కారం సినిమా ఉంటుందా? లేదా? అనే విషయం ఇప్పుడు సినీ ప్రియుల మధ్య చర్చ జరుగుతోంది. కథానాయిక పూజా హెగ్డే తప్పుకోవడం, శ్రీలీల ప్రధాన హీరోయిన్ కావడం, పూజా స్థానంలో మీనాక్షి చౌదరి రావడం... అంతేకాదు.. సినిమాటోగ్రాఫర్ పి.ఎస్. వినోద్ తప్పుకోగా ఆయన స్థానంలో రవి కె చంద్రన్ వచ్చారు. తమన్ తప్పుకుంటున్నాడంటూ మరోవైపు వార్తలు వస్తున్నాయి. కుమార్తె పుట్టినరోజు ఉందంటూ అకస్మాత్తుగా మహేష్ బాబు కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లారు. ప్రస్తుతానికి ఆయన వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

stopped the guntur kaaram movie

ఇటువంటి సందర్భంలో ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మొదటి సింగిల్ రిలీజ్ చేయబోతున్నారని, అందుకు ముహూర్తం ఖరారైందని వార్తలు వస్తున్నాయి. ఆగస్టు 9వ తేదీన మొదటి పాటను విడుదల చేయబోతున్నారు. సినిమా షూటింగ్ కు సంబంధించి వివాదాలు తలెత్తుతూనే ఉన్న నేపథ్యంలో మరోవైపు పాట రిలీజ్ చేస్తున్నారు కాబట్టి సంక్రాంతికి సినిమా ఉంటుందనే నమ్మకంలో మహేష్ బాబు అభిమానులున్నారు. చూడాలి... భవిష్యత్తులో ఈ సినిమాకు సంబంధించిన వివాదాలు ఇంకెన్ని తలెత్తుతాయో..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+