Dogs Attack: గోల్కొండలో బాలుడిపై వీధి కుక్కల దాడి.. ఆస్పత్రికి తరలింపు..

హైదరాబాద్ లో వీధి కుక్కల దాడులు ఆగడం లేదు. కొద్ది రోజుల క్రితం అంబర్ పేటలో కక్కుల దాడిలో ప్రదీప్ అనే బాలుడు మృతి చెందారు. ఆ తర్వాత కూడా సిటీలో ప్రజలపై కుక్కలు దాడులు చేశాయి. తాజాగా గోల్కొండ సమీపంలోని లక్ష్మినగర్ బస్తీలో ఇంటి ముందు ఆడుకుంటున్న 5 ఏళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. స్థానికులు గమనించి కేకలు వేయడంతో కుక్కలు పారిపోయాయి. బాలుడిని కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి.

బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాలుడికి చికిత్స చేసిన వైద్యులు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. జిల్లాల్లో కూడా కుక్కల దాడులు ఆగడం లేదు. కొద్ది రోజుల క్రితం ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం మండల పరిధిలోని పుటనీతండాలో భరత్ అనే ఐదేళ్ల బాలుడుపై ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురంలో బాలికపై వీధి కుక్క దాడి చేసింది.

Street Dogs attacked on boy at golkonda in hyderabad

ఈ దాడిలో జహీదా అనే పాపకు తీవ్ర గాయాలయ్యాయి. పాపను మెరుగైన చికిత్స కోసం హుజుర్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మార్చి 7న చంపాపేట డివిజన్‌ యాదగిరినగర్‌కాలనీ సంతో‌షనగర్‌ ప్రధాన రహదారి పక్కన నిద్రిస్తున్న యాచకుడిపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో వీధి కుక్కల దాడులు పెరిగిపోడంతో ప్రజలు భయపడిపోతున్నారు. ముఖ్యంగా రాత్రి బయటకు రావాలంటే జంకుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+