రూ. 45 కోట్ల నష్టం.. అందుకే సుబ్బారావు ఉసిగొల్పారు.. రిమాండ్ రిపోర్ట్
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో జరిగిన అల్లర్లలో ప్రధాన ముద్దాయి సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు.. ఆయన ప్రోద్బలంతోనే దాడి జరిగిందని తేలింది. అతనిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 2014 లో సుబ్బారావు సాయి డిపెన్స్ అకాడమీని ఏర్పాటు చేశాడట. ఎక్కడ ఆర్మీ రిక్రూట్ మెంట్ జరుగుతుంటే అక్కడకు వెళ్లి ఆర్మీ అభ్యర్ధుల వివరాలు తీసుకునేవాడట.

కోచింగ్ సెంటర్‌లో చేరమని..
తన కోచింగ్ సెంటర్‌లో చేరమని కోరేవాడని తెలిసింది. కోచింగ్ సెంటర్‌లో అడ్మిషన్ కోసం అభ్యర్ధుల ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రూ.3 లక్షలకు సుబ్బారావు బాండు తీసుకునే వాడని తెలిసింది. అగ్నిపథ్ పథకం వల్ల సుబ్బారావుకు 45 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. అందుకోసం విద్యార్ధుల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి పరీక్ష పెట్టించాలనుకున్నాడు.

ఇక ఆర్మీ పరీక్ష నో
ఆర్మీ పరీక్ష లేకపోవటంతో సుబ్బారావ్ వద్ద కోచింగ్ తీసుకున్న అభ్యర్ధులు హకీంపేట సోల్జర్స్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. గ్రూప్ సభ్యులు అందరూ హైదరాబాద్‌లో గల ఏఆర్వో ఆఫీసుకు ర్యాలీగా వెళ్లాలని అనుకున్నారు. సికింద్రాబాద్ ఘటన జరగటానికి ఒకరోజు ముందు సుబ్బారావు హైదరాబాద్ చేరుకుని బోడుప్పల్‌లో ఉన్నాడు. అక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నిరసనలపై మల్లారెడ్డి, శివకుమార్‌తో డిస్కస్ చేశాడు.

ఆడియో
బసిరెడ్డితో ఫోన్‌లో మాట్లాడాడు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా బీహార్ తరహాలో విధ్వంసం చేయాలని వాట్సప్ గ్రూపులో సభ్యులకు సుబ్బారావు వివరించాడు. పెట్రోల్ బాటిల్స్‌తో సికింద్రాబాద్ స్టేషన్‌లోకి వెళ్లాలని ఆడియో మెసేజ్ పెట్టారని పోలీసులు గుర్తించారు. దీంతో కుట్రదారు సుబ్బారావు అని తేలింది. తనకు నష్టం జరుగుతుందని తెలిసి.. ఆందోళనలు చేయించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications