చిన్నజీయర్ స్వామిని పరామర్శించిన సీఎం కేసీఆర్...
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి సోమవారం(సెప్టెంబర్ 14) పరామర్శించారు. శంషాబాద్‌లోని ముచ్చింతల్ శ్రీరాంనగర్‌లో ఉన్న చిన్నజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లి గంట పాటు అక్కడ గడిపారు. ఇటీవల చిన్నజీయర్ మాతృమూర్తి అలివేలు మంగతాయారు స్వర్గస్తులైన నేపథ్యంలో సీఎం మర్యాదపూర్వకంగా స్వామిని కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ తన సానుభూతిని,సంతాపాన్ని వ్యక్తపరిచారు. సీఎం వెంట మైంహోమ్ రామేశ్వరరావు కూడా ఆశ్రమానికి వెళ్లారు. చిన్నజీయర్‌తో భేటీ అనంతరం అక్కడినుంచి హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు బయలుదేరారు.
చిన్నజీయర్ స్వామి తల్లి(85) హైదరాబాద్‌లోని నారాయణగూడలో శనివారం(సెప్టెంబర్ 12) రాత్రి 10గంటలకు కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్య సమస్యలతో ఆమె కన్నుమూశారు. ముచ్చింతల్‌లోని ఆశ్రమ సమీపంలోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు ఆమె పార్థివదేహాన్ని భక్తుల సందర్శనార్థం జిమ్స్ కాలేజీలో ఉం చారు. అంత్యక్రియలకు మై హోమ్ సంస్థల అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, ఎండీ జూపల్లి జగపతిరావు, వారి కుటుంబసభ్యులు, పలురంగాల ప్రముఖులు వచ్చారు.

అలివేలు మంగతాయారుకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. వీరిలో చినజీయర్ పెద్ద కుమారుడు. తల్లి ఆదేశానుసారమే చినజీయర్ సన్యాసం స్వీకరించారు. సీఎం కేసీఆర్‌కు ఆయనతో మొదటినుంచి మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. చాలా సందర్భాల్లో కేసీఆర్ చిన్నజీయర్ ఆశ్రమానికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకుంటుంటారు.












Click it and Unblock the Notifications