రేపే తెలంగాణ బడ్జెట్: 2.70 లక్షల కోట్లు..? ప్రవేశపెట్టనున్న హరీశ్ రావు
తెలంగాణ బడ్జెట్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. శాసనభలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టనున్నారు. ఆదివారం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సమావేశమైన మంత్రిమండలి అసెంబ్లీ నిర్వహణపై చర్చించింది. సమావేశంలో బడ్జెట్‌కు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతిపక్షాలు సంధించే ప్రశ్నలను సమర్థంగా ఎదుర్కోవాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ సూచించారు. సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలపై పైచేయి సాధించాలన్నారు.

ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో రూ.2,30,825.96 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అదీ రూ.2.70 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం కనిపిస్తుంది. తొలిసారి తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నా సీఎం కేసీఆర్ మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఎప్పటిలాగే సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తారు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్.. పథకాలు కంటిన్యూ చేస్తారు. కొత్తగా దళితబంధు కూడా వచ్చి చేరింది. అలాగే ఎన్నిలను దృష్టిలో ఉంచుకొని సంక్షేమానికి పెద్ద పీట వేసినట్టు సమాచారం. పెన్షన్లకు కూడా నిధుల కేటాయింపు ఉంటుంది. రైతు రుణమాఫీపై మాత్రం స్పష్టత లేదు. దానిని తీర్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. అన్నీ వర్గాలను ఆకట్టుకోవాలని కేసీఆర్ అనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications