• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తెలంగాణ క్యాబినెట్ విస్త‌ర‌ణ ముహూర్తం ఖ‌రారు..! : కేటిఆర్ కు డౌట్ : స‌్పీక‌ర్ గా సీనియ‌ర్ ..!

|
  KCR May Expansion Of Cabinet By End Of this Month

  తెలంగాణ క్యాబినెట్ విస్త‌ర‌ణ ముహూర్తం దాదాపు ఖ‌రారైంది. తెలంగాణ ఎన్నిక‌ల్లో గెలిచిన త‌రువాత ముఖ్య‌మంత్రి గా కెసిఆర్..మంత్రిగా మ‌హ‌మూద్ అలీ ప్ర‌మాణ స్వీకారం చేసారు. ఆ త‌రువాత క్యాబినెట్ ఎప్పుడు విస్త‌రిస్తార‌నే అంశం పై అనేక ఊహాగానాలు ప్ర‌చారం లోకి వ‌చ్చాయి. అయితే, కేసీఆర్ దీని పై ఓ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. స్పీక‌ర్ ప‌ద‌వి సైతం ఖ‌రారైంద‌ని చెబుతున్నారు. ఇక‌, కేటిఆర్ కు క్యాబినెట్ లో స్థానం పై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు..

  విస్త‌ర‌ణ ముహూర్తం దాదాపు ఖరారు...

  విస్త‌ర‌ణ ముహూర్తం దాదాపు ఖరారు...

  తెలంగాణ క్యాబినెట్ విస్త‌ర‌ణ ముహూర్తం దాదాపు ఖ‌రారు అయింది. ముఖ్య‌మంత్రిగా కేసిఆర్‌..మంత్రిగా మ‌హ‌మూద్ అలీ ప్ర‌స్తుతం క్యాబినెట్‌లో ఉన్నారు. మ‌రో 16 మంది వ‌ర‌కు మంత్రివ‌ర్గంలోకి తీసుకొనేందుకు వెసులు బాటు ఉంది. అందు లో గ‌తంలో జ‌రిగిన పొర‌పాట్లు పున‌రావృతం కాకుండా..మ‌హిళ‌ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని ఇప్ప‌టికే కేసిఆర్ నిర్ణ‌యించి న‌ట్లు స‌మాచారం.

  దీంతో..మ‌హిళ‌కు స్పీక‌ర్ ప‌ద‌వి ఇవ్వాలా లేక కీల‌క మంత్రి పోర్టుఫోలియో ఇవ్వాలా అనే దాని పై తుది నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఈ నెల 30వ తేదీ కేసిఆర్ త‌న క్యాబినెట్ విస్త‌ర‌ణ కు యోచిస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచా రం. ఓడిపోయిన వారు సీనియ‌ర్లు..కీల‌క నేత‌లైనా వారికి క్యాబినెట్ లో అవకాశాలు లేన‌ట్లే.

  ఆ పదవిపై పెదవి విరుపు..! నువ్విస్తానంటే నేనొద్దంటున్నా..! తెలంగాణ సర్కార్ లో నయా ట్విస్ట్

  అదే స‌మ‌యంలో వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకొని ఇద్ద‌రు మాజీ మంత్రుల‌కు అవ‌కాశం ఇవ్వ‌టం లేద‌ని తెలుస్తోంది. ఇక‌, జిల్లాల వారీ గా ..సామాజిక స‌మీక‌ర‌ణాల‌ను దృష్టిలో ఉంచుకొని కేసిఆర్ మంత్రివ‌ర్గ కూర్పు పై తుది క‌స‌ర‌త్తు చేస్తున్నారు. 27వ తేదీన కేసిఆర్ త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగించుకొని హైద‌రాబాద్ చేరుతారు...ఆ వెంట‌నే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ పై దృష్టి సారించే అవ కాశాలు క‌నిపిస్తున్నాయి.

  కేటిఆర్ కు చాన్స్ లేన‌ట్లేనా...ఎవ‌రికి అవ‌కాశం ద‌క్కేను..

  కేటిఆర్ కు చాన్స్ లేన‌ట్లేనా...ఎవ‌రికి అవ‌కాశం ద‌క్కేను..

  ఈ సారి క్యాబినెట్ విస్త‌ర‌ణ లో కేసిఆర్ భ‌విష్య‌త్ రాజ‌కీయ వ్యూహాల‌కు అనుగుణంగా మంత్రివ‌ర్గాన్ని ఏర్ప‌టు చేసుకో నున్నారు. వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌లు...జాతీయ రాజ‌కీయాల్లో త‌న పాత్ర‌ను దృష్టిలో పెట్టెకొని..

  ప్ర‌భుత్వ పాల‌న పై ఏ మాత్రం ప్ర‌భావం ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ఈ కూర్పు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సారి క్యాబినెట్ మ‌హ‌బూబ్ న‌గ‌ర్.. హైద‌రాబాద్ న‌గ‌రానికి ప్ర‌త్యేకంగా ప్రాధాన్య‌త ఇచ్చే అవ‌కాశం ఉంది. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ నుండి నిరంజ‌న్ రెడ్డి..

  హైద‌రాబాద్ నుండి అరికెపూడి గాంధీ..దానం నాగేంద‌ర్ ల‌కు అవ‌కాశం ల‌భించే ప‌రిస్థితి కనిపిస్తోంది. ఇక‌, తాజాగా టిఆర్‌య‌స్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన కేటిఆర్ కు క్యాబినెట్ లో అవ‌కాశం లేద‌నే వాద‌న వినిపిస్తోం ది. కేటిఆర్ ను పూర్తిగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు..లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు కేడ‌ర్ ను స‌మాయ‌త్తం చేయ‌ట‌మే ల‌క్ష్యంగా వినియో గించుకోవాల‌నేది కేసిఆర్ వ్యూహంగా క‌నిపిస్తోంది. అయితే, అటు ప్ర‌భుత్వం ..ఇటు పార్టీలోనూ కేటిఆర్ సామ‌ర్ద్యం నిరూపించుకొనే అవ‌కాశం ఇవ్వాల‌నే విజ్ఞ‌ప్తి కేసిఆర్ స‌న్నిహితుల నుండి వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది.

  స్పీక‌ర్ గా సీనియ‌ర్ నేత‌కే..

  స్పీక‌ర్ గా సీనియ‌ర్ నేత‌కే..

  ఒక‌..స్పీక‌ర్ పోస్టు గురించి టీఆర్‌య‌స్ లో చ‌ర్చ బాగా జ‌రుగుతోంది. గ‌త ప్ర‌భుత్వంలో స్పీక‌ర్ గా వ్య‌వ‌మ‌రించిన మ‌ధు సూద‌నాచారి ఈ సారి ఓడిపోయారు. దీంతో..ఎవ‌రికి అవ‌కాశం ఇస్తార‌నే దాని పై ఆస‌క్తి పెరుగుతోంది. డిప్యూటీ స్పీక‌ర్ గా ప‌ని చేసిన ప‌ద్మా దేవేంద‌ర్ కు ఇస్తార‌నే వాద‌న ఉంది.

  అదే స‌మ‌యంలో..ఎస్టీ నాయ‌కుడు...ప్ర‌స్తుత ఎమ్మెల్యేల్లో కేసిఆర్ త‌రువాత సీనియ‌ర్ అయిన రెడ్యా నాయ‌క్ పేరు బ‌లంగా వినిపిస్తోంది. ఎస్టీకి స్పీక‌ర్ ఇవ్వ‌టం ద్వారా రాజ‌కీ యంగా మైలేజ్ వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. ఇక‌, మ‌హిళా కోటాలోనూ ఈ సారి ఇద్ద‌రి వ‌ర‌కూ ఛాన్స్ ఉంటుంద‌ని తెలు స్తోంది. అయితే, కేసిఆర్ చేప‌ట్టే మంత్రివ‌ర్గ కూర్పు లో ఒకేసారి అంద‌రినీ భ‌ర్తీ చేస్తారా.. లేక కొంద‌రికి అవ‌కాశం ఇచ్చి .. రియాక్ష‌న్స్ చూసిన త‌రువాత పూర్తి స్థాయి క్యాబినెట్ ఏర్పాటు చేస్తారా అనేది చూడాల్సి ఉంది.

  English summary
  KCR may expansion of cabinet by end of this month. Mostly 8 members may get chance as ministers. KTR entry inn Govt is in dailama.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X