హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ నమ్మకం వమ్ము చేయం.. చీఫ్ విప్ దాస్యం, విప్ రేగా పదవీ బాధ్యతల స్వీకారం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ప్రభుత్వ చీఫ్ విప్‌గా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు విప్‌గా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఆ మేరకు అసెంబ్లీ ఆవరణలోని చీఫ్ విప్ ఛాంబర్‌లో ఇద్దరూ కలిసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వినయ్ భాస్కర్, రేగా కాంతారావు మాట్లాడుతూ.. తమ మీద నమ్మకంతో ఈ పదవులు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీకి వన్నె తెచ్చేలా తమవంతు క‌ృషి చేస్తామని చెప్పుకొచ్చారు. దేశంలోనే తెలంగాణ అసెంబ్లీ ఆదర్శవంతంగా పనిచేస్తోందన్నారు.

Telangana Government Chief VIP Dasyam Vinay Bhaskar and VIP Rega Kantha Rao taken charge.

ప్రజారోగ్యంపై తెలంగాణ సర్కార్ నజర్.. పేదలకు 58 రకాల ఆరోగ్య పరీక్షలు ఫ్రీప్రజారోగ్యంపై తెలంగాణ సర్కార్ నజర్.. పేదలకు 58 రకాల ఆరోగ్య పరీక్షలు ఫ్రీ

ఇక దాస్యం వినయ్ భాస్కర్ ప్రత్యేకంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆనాడు ఉద్యమంలో క్రీయాశీలకంగా పనిచేశానని గుర్తు చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తన వంతు శాయశక్తులా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. ఆ మేరకు సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో పనిచేస్తానంటూ తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ప్రభుత్వ చీఫ్ విప్‌గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Telangana Government Chief VIP Dasyam Vinay Bhaskar and VIP Rega Kantha Rao taken charge.

ఆ క్రమంలో ప్రతిపక్ష నేతల ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొడతామన్నారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగేలా అన్ని పక్షాలను కలుపుకొని పోతామని తెలిపారు. అదలావుంటే ఇదివరకే గొంగిడి సునీత, గంప గోవర్ధన్, గువ్వల బాలరాజు, అరికెపూడి గాంధీ, బాల్క సుమన్ ను విప్‌లుగా నియమించిన సంగతి తెలిసిందే.

English summary
Telangana Government Chief VIP Dasyam Vinay Bhaskar and VIP Rega Kantha Rao taken charge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X