Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్‌లో నయాధందా: కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ పేరుతో ఫోన్‌కాల్స్: పోలీసులు ఏం చెబుతున్నారు?

హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి దేశవ్యాప్తంగా త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. దీనికోసం ఇప్పటికే ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో డ్రై రన్ సైతం నిర్వహించారు. ఫిబ్రవరి నాటికి వ్యాక్సినేషన్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మోసగాళ్లు కొత్త ధందాకు తెర తీశారు. కరోనా వ్యాక్సినేషన్‌ను కూడా సొమ్ము చేసుకోవడానికి వెనుకాడట్లేదు. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ పేరుతో ఫోన్లు చేసి మరీ.. వ్యక్తిగత, బ్యాంకు అకౌంట్ల వివరాలను ఆరా తీస్తున్నారు. అలాంటి ఫోన్ కాల్స్ మాయలో పడొద్దంటూ హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్‌‌లో కరోనా వ్యాక్సిన్‌ పేరిట కొత్త మోసానికి గుర్తు తెలియని వ్యక్తులు పాల్పడినట్లు వార్తలు అందుతుండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. వ్యాక్సిన్‌ను వేయించుకోవడానికి ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుందని, దానికి కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందంటూ మభ్య పెడుతున్నారు. ఫోన్లు చేసి.. వయస్సు, అడ్రస్, బ్యాంకు అకౌంట్ల వివరాలను తెలుసుకుంటున్నారు. ఆధార్ కార్డు నంబర్లను సైతం అడుగుతున్నారు. ఓటీపీ నంబర్లను తెలుసుకుంటున్నారు. ఒక్కసారి ఓటీపీ నంబర్ ఆ మోసగాళ్ల చేతిలో పడితే.. బ్యాంకు అకౌంట్లు ఖాళీ అయిపోతోన్నాయి.

Telangana: Cyberabad Police warns citizens of Covid19 vaccine registration fraud

కొత్తగా హైదరాబాద్, సైబరాబాద్ పోలస్ కమిషనరేట్ల పరిధిలో నమోదవుతోన్న ఈ నయాధందా పట్ల పోలీసులు అప్రమత్తం అయ్యారు. కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ పేరుతో ఎలాంటి ఫోన్లు వచ్చిన వాటికి స్పందించవద్దని, తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.

5. మిస్ ఇండియా గ్లోబల్ ఆషిమా నర్వాల్ కిల్లింగ్ లుక్ ఫొటోలు

వ్యాక్సిన్ రిజిస్ట్రేసన్ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దని, ఓటీపీ నంబర్లను షేర్ చేయొద్దని ప్రజలకు విజ్ఙప్తి చేస్తున్నారు. అలాగే- డెబిట్/క్రెడిట్ కార్డుల వివరాలను గుర్తు తెలియని వ్యక్తులకు తెలియపరచవద్దని కోరుతున్నారు. కరోనా వ్యాక్సిన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది. డ్రై రన్ నిర్వహించిన తరువాతే ఇలాంటి ఫోన్ కాల్స్ అధికం అయ్యాయని ఫిర్యాదులు అందుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+