Hyderabad: రీల్స్ చేయండి.. రూ.1 లక్ష గెలుచుకోండి !
తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ ఆధ్వర్యంలో 'హ్యాపెనింగ్ హైదరాబాద్' పేరుతో పోటీ నిర్వహిస్తోంది. హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి పనులపై ఒక రీల్ చేసి పోస్ట్ చేయాలి. రీల్స్ నుంచి మంచి రీల్ ఎంపిక చేసి బహుమతి ఇస్తారు. ఈ పోటీలో పాల్గొనేవారు #HappeningHyderabadతో రీల్ చేసి పోస్ట్‌లలో @DigitalMediaTS అని ట్యాగ్ చేయాలి. పోటీలో గెలుపొందిన వారు 1,00,000 వరకు నగదు బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది. పోటీలో తమ పేరు నమోదు చేసుకునేందుకు ఏప్రిల్ 30 వరకు తుది గడువు ఉంది.
"హైదరాబాద్ అంటే ఇష్టమా? ఇక్కడ మీ కోసం ఉత్తేజకరమైన విషయం ఉంది! #HappeningHyderabad ఆకర్షణ, అభివృద్ధిని సంగ్రహించండి. ట్యాగ్ చేయడం ద్వారా మాతో భాగస్వామ్యం చేయండి @DigitalMediaTS, రూ. 1,00,000/- విలువైన నగదు బహుమతులు గెలుచుకోండి" అని తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ పోటీ గురించి మరింత సమాచారం కోసం తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ అధికారిక వెబ్‌సైట్ https://it.telangana.gov.in/contest/ను సందర్శించండి.

Great with Reels? Love Hyderabad? Here's something exciting for you!
— Telangana Digital Media Wing (@DigitalMediaTS) April 4, 2023
Capture the charm and vividness of #HappeningHyderabad and share with us by tagging @DigitalMediaTS
Win cash prizes worth Rs 1,00,000/-
Entries close on April 30. For details visit https://t.co/8J20OoaI9v pic.twitter.com/oaL1KTlI0Y












Click it and Unblock the Notifications