యురేనియం తవ్వకాలపై తెలంగాణ డబుల్ గేమ్ : కిషన్ రెడ్డి

Recommended Video

    Telangana Government Has Given Permission For Uranium Mining : Kishan Reddy || Oneindia Telugu

    యురేనియం తవ్వకాలపై తెలంగాణ ప్రభుత్వం డ్రామాలు అడుతోందని కేంద్ర హోంశాఖ సహయా మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ పార్టీతో పాటు,కాంగ్రెస్ పార్టీలు తవ్వకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.రాష్ట్ర ప్రభుత్వం అనుమతుల మేరకే కేంద్ర ప్రభుత్వం అక్కడ పరిశోధనలు చేస్తోంది తప్ప, ఎలాంటీ తవ్వకాలు చేపట్టడడం లేదని ఆయన స్పష్టం చేశారు. యురేనియం లభ్యం పై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు, తెలంగాణ ప్రభుత్వం కూడ 2016లో అనుమతులు ఇచ్చిందని ఆయన వివరించారు.

    నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మాణం ప్రవేశపెట్టింది. దీంతో సభ మొత్తం తీర్మాణాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. కాగా అంతకు ముందే సీఎం కేసిఆర్ యురేనియం తవ్వకాలను ఆనుమతి ఇవ్వమని సీఎం కేసిఆర్ సైతం సభలో ప్రకటించారు.

    Telangana government has given permission for uranium mining :Kishan Reddy

    యురేనియం అనుమతులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని,తెలంగాణ ప్రభుత్వం ఎలాంటీ అనుమతులు ఇవ్వలేదని ,దీంతో పాటు భవిష్యత్‌లో కూడ అనుమతులు ఇవ్వాలనే ఆలోచన ఏది లేదని సీఎం కేసిఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు తాగునీరు అందించే క్రిష్ణాజలాలు కలుషితమవుతున్న నేపథ్యంలో తవ్వకాలను అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు. ఒకవేళ కేంద్రం ప్రజల అభిప్రాయాలను కాదని ముందుకు వెళితే అందరం కలిసి పోరాటం చేస్తామని అన్నారు.

    నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై గత కొద్ది రోజులు,పర్యవరణ వేత్తలతోపాటు సామాజిక వేత్తలు, ఇతర రాజకీయ పార్టీల నుండి ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కేంద్రం నిర్వహిస్తున్న తవ్వకాలపై ప్రజా అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు ముందుకు వచ్చింది. యురేనియం తవ్వకాలతో తెలంగాణకు ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసిన సీఎం కేసిఆర్ వీటివల్ల కృష్ణా జలాలు కలుషితం అవుతున్నాయని సభలో వ్యాఖ్యానించారు. దీంతో యురేనియం తవ్వకాలను అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+