హైదరాబాద్‌లోని షాపింగ్ ప్రియులకు తెలంగాణ సర్కారు షాక్..
హైదరాబాద్‌లోని షాపింగ్ ప్రియులకు తెలంగాణ సర్కారు షాక్ ఇచ్చింది. రాత్రి 10.30 సమయంలో షాప్‌లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ వంటి సిటీల్లో చాలామంది నైట్ షాపింగే ఎక్కువ ప్రాధాన్యత కనబరుస్తుంటారు. రాత్రి పదకొండైనా చాలామంది బయటే ఎక్కువగా కనిపిస్తుంటారు. పగలంతా ఆఫీసుల్లో ఉన్న వారు రాత్రి సమయాల్లో షాపింగ్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. కానీ, ఇలాంటి సమయాల్లో షాపింగ్ చేసేవారికి ప్రభుత్వం బ్రేక్ వేసింది. నగరంలో
క్రైమ్ రేట్ పెరిగిపోవడంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి శాంతిభద్రతలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
అసలు క్రైమ్ రేట్ పెరగడానికి కారణాలు ఏమై ఉంటాయనే విషయంపై ముఖ్యమంత్రి ఆరా తీయగా, రాత్రి సమయాల్లో క్కువ మంది రోడ్లపై ఉండట, షాపులు రాత్రిళ్లు తెరవడంపై పోలీసులు కొంత ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే, దీనిపై రివ్యూ చేసిన సీఎం రేవంత్ రెడ్డి రాత్రి 10.30 నుంచి 11 గంటల మధ్య దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

నగరంలో శాంత్రిభద్రతలు చాలా ముఖ్యమని అందుకే వ్యాపారులు సహకరించాల్సిందని ఆయన కోరారు. సీఎం సూచనల మేరకు పోలీసులు కూడా చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని కమర్శియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ కింద ఉన్న వ్యాపార సంస్థలు రాత్రి పదిన్నర నుంచి పదకొండు గంటల మధ్య షాప్‌లు క్లోజ్ చేయాలని ఆదేశాలు విడుదల చేశారు. శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకొని దీనిని అమలు చేయాలని పోలీసులు వ్యాపారులకు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే రాత్రి 10.30 నుంచి 11మధ్యలో దుకాణాలన్నీ మూసివేయబడి ఉంటాయి.












Click it and Unblock the Notifications