హైదరాబాద్: అన్ని జోన్లలో కొత్త డివిజన్లు, కొత్త పీఎస్‌లు ఇవే, జీవో జారీ
హైదరాబాద్: నగర జనాభా భారీగా పెరుగుతున్న క్రమంలో రాష్ట్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో జరిగే రాజకీయ కార్యక్రమాలు, ధర్నాలు, ఆందోళనలు, రాస్తారోకోలతో ఇప్పటికే పని ఒత్తిడితో సతమతమవుతున్నారు పోలీసులు. ఈ క్రమంలో అదనపు భారాన్ని తగ్గించేందుకు హైదరాబాద్ పరిధిలో పోలీస్ ఉన్నతాధికారులు కొత్త జోన్లు ఏర్పాటు చేశారు. జోన్లకు డీసీపీలను కూడా కేటాయించారు.
ఈ జోన్లలో డివిజన్లు, కొత్త పోలీస్‌స్టేషన్లను కూడా ఏర్పాటు చేసేందుకు నూతన సచివాలయం ప్రారంభం సందర్భంగా మొదటి జీవో జారీ చేశారు హోంమంత్రి మహమూద్‌అలీ. రాష్ట్రవ్యాప్తంగా మరో 40 పోలీస్‌స్టేషన్లు నిర్మించేందుకు పరిపాలన అనుమతులు మంజూరు అయ్యాయి.

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా డివిజన్లు, పీఎస్‌లు:
సైఫాబాద్ డివిజన్ పరిధిలో ఖైరతాబాద్ పీఎస్
సెంట్రల్‌జోన్ పరిధిలో గాంధీనగర్ డివిజన్ ఏర్పాటు
ఈస్ట్‌జోన్‌పరిధిలో చిలకలగూడ, ఉస్మానియా యూనివర్శిటీ డివిజన్లు
చిలకలగూడ డివిజన్ పరిధిలో కొత్తగా వారాసిగూడ పీఎస్
నార్త్‌జోన్ పరిధిలో తిరుమలగిరి, బేగంపేట డివిజన్, తాడ్‌బంద్ పీఎస్
సౌత్ఈస్ట్ జోన్ పరిధిలో చాంద్రాయణ్‌గుట్ట, సైదాబాద్ డివిజన్లు
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా పలు డివిజన్లు, పోలీస్ స్టేషన్లు ఏర్పాటవుతున్నాయి. సెంట్రల్‌జోన్ పరిధిలో గాంధీనగర్ డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు. దీని పరిధిలో దోమలగూడ, లేక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. సైఫాబాద్ డివిజన్ పరిధిలో ఖైరతాబాద్ పీఎస్ అందుబాటులోకి రానుంది. ఈస్ట్‌జోన్ పరిధిలో చిలకలగూడ, ఉస్మానియా యూనివర్శిటీ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి.
చిలకలగూడ డివిజన్ పరిధిలో వారాసిగూడ పీఎస్ నూతనంగా ఏర్పాటు కానుంది. నార్త్‌జోన్ పరిధిలోని బేగంపేటడివిజన్, తాడ్‌బంద్ పీఎస్ అందుబాటులోకి రానుంది. ఇదే జోన్‌లో తిరుమలగిరి డివిజన్‌కు కూడా ఏర్పాటు చేస్తారు. నూతనంగా ఏర్పాటైన సౌత్ ఈస్ట్‌జోన్‌పరిధిలో చాంద్రాయణ్ గుట్ట, సైదాబాద్ డివిజన్లు ఏర్పాటు చేస్తున్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్, రాజేంద్రనగర్ జోన్ నూతనంగా ఏర్పాటయ్యాయి. అల్లాపూర్, సూరారం, జీనోమ్ వ్యాలీ, అత్తాపూర్, కొల్లూరు, మోకిళ్ల పోలీస్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి.
వెస్ట్ సౌత్‌జోన్ పరిధిలో గోల్కొండ డివిజన్, టోలిచౌకీ పీఎస్
కొత్తగా కుల్సుంపురా డివిజన్, గుడిమల్కాపూర్ పీఎస్ ఏర్పాటు
సౌత్‌జోన్‌పరిధిలో చత్రినాక డివిజన్ ఏర్పాటు
వెస్ట్‌జోన్‌పరిధిలోని బంజారాహిల్స్ డివిజన్‌లో మాసబ్‌ట్యాంక్ పీఎస్..
రాచకొండ కమిషనరేట్ పరిధిలో చర్లపల్లి, నాగోల్, గ్రీన్ ఫార్మా సిటీ పీఎస్..
పోచారం ఐటీ కారిడార్, ఉప్పల్ మహిళా పీఎస్
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్, రాజేంద్రనగర్ జోన్ ఏర్పాటు
టోలిచౌకీ పీఎస్ నూతనంగా.. వెస్ట్‌సౌత్‌జోన్ పరిధిలో గోల్కొండ డివిజన్, అందులో టోలిచౌకీ పీఎస్ నూతనంగా ఏర్పాటు కానున్నాయి.
కుల్సుంపురా డివిజన్, గుడిమల్కాపూర్ పీఎస్ కొత్తగా రానున్నాయి. సౌత్‌జోన్‌పరిధిలో చత్రినాక డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు. వెస్ట్‌జోన్‌పరిధిలో బంజారాహిల్స్ డివిజన్‌లో మాసబ్‌ట్యాంక్, జూబ్లీహిల్స్ డివిజన్, ఫిల్మ్ నగర్ పీఎస్, ఎస్సార్ నగర్ డివిజన్, రహ్మత్‌నగర్ పీఎస్, బోరబండ పీఎస్ కొత్తగా ఏర్పాటు కానున్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో చర్లపల్లి, నాగోల్, గ్రీన్ ఫార్మా సిటీ పీఎస్, పోచారం ఐటీ కారిడార్, ఉప్పల్ మహిళా పోలీస్‌స్టేషన్లు నూతనంగా ఏర్పాటు కానున్నాయి. ఘట్ కేసర్, జవహార్ నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నంలో నూతనంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి.












Click it and Unblock the Notifications