disha case encounter: సీపీ మహేష్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు

హైదరాబాద్: దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు సోమవారం నిర్ణయం తీసుకుంది.

సీపీ మహేష్ భగవత్ నేతృత్వంలో సిట్..

సీపీ మహేష్ భగవత్ నేతృత్వంలో సిట్..

ఏడుగురు సభ్యులతో కూడిన సిట్‌కు రాచకొండ సీపీ మహేష్ భగవత్ నేతృత్వం వహించనున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)లో వనపర్తి ఎస్పీ కే అపూర్వరావు, మంచిర్యాల డీసీపీ ఉగయ్ కుమార్ రెడ్డి, రాచకొండ అదనపు డీసీపీ సురేందర్ రెడ్డి, సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, రాచకొండ ఐటీ సెల్‌కు చెందిన శ్రీధర్ రెడ్డి, కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు.

మరో వైపు జాతీయ మానవ హక్కుల సంఘం విచారణ..

మరో వైపు జాతీయ మానవ హక్కుల సంఘం విచారణ..

కాగా, దిశ హత్యాచార కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్ఆర్‌సీ) విచారణ జరుగుతోంది. విచారణలో భాగంగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఎన్‌హెచ్ఆర్‌సీ సభ్యులు మొదటి రోజు మృతదేహాలను ఉంచిన మహబూబ్‌నగర్ ఆస్పత్రికి చేరుకుని పలు వివరాలు సేకరించారు. అనంతరం చటాన్‌పల్లికి వెళ్లి ఎన్‌కౌంటర్ జరిగిన స్థలాన్ని పరిశీలించారు. రెండో రోజైన ఆదివారం దిశ తండ్రి, సోదరిని ఎన్‌హెచ్ఆర్‌సీ సభ్యులు విచారించారు. దిశ ఘటన, నిందితుల ఎన్‌కౌంటర్‌పై వారి వాంగ్మూలాన్ని తీసుకున్నారు.

దాడికి దిగడంతో ఎన్‌కౌంటర్..

దాడికి దిగడంతో ఎన్‌కౌంటర్..


గత శుక్రవారం తెల్లవారుజామున దిశ హత్యాచారం కేసులో నిందితులైన మహ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు నవీన్, జొల్లు శివలను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఘటనా స్థలానికి కేసు రీకన్‌స్ట్రక్చన్ భాగంగా నిందితులను తీసుకెళ్లగా.. అక్కడ వారు పోలీసులపై దాడి చేసి తుపాకీలు లాక్కుని పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో నలుగురు నిందితులు మృతి చెందారు. నిందితుల దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై దేశం వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ పోలీసులపై ప్రశంసల వర్షం కురిసింది. అయితే, మరికొందరు మాత్రం నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం సరికాదని, చట్టం ప్రకారం వెళ్లాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+