విమోచన, ఐక్యతా దినోత్సవ సందడి: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షల అలర్ట్
హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవం, జాతీయ సమైక్యతా వేడుకల నేపథ్యంలో ఆదివారం (సెప్టెంబర్ 17న) హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవం, బీజేపీ భారీ బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఇప్పటికే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు.
ఈ క్రమంలో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సికింద్రాబాద్, పరేడ్ గ్రౌండ్ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు హైదరాబాద్ నగర ట్రాఫిక్ చీఫ్ సుధీర్ బాబు తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ చుట్టుపక్కల రూట్లలో వెళ్లేవారు తమ ప్రయాణాలను ఆంక్షలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలన్నారు.

సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్, ఐడీ కార్డును చూపిస్తే బారికేడింగ్ పాయింట్ల నుంచి అనుమతిస్తామని ఆయన తెలిపారు. ట్రాఫిక్ కు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఎదురైనా హెల్ప్ లైన్ నెంబర్ 9010203626కు కాల్ చేయాలని సుధీర్ బాబు సూచించారు.
ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఇలా
పరేడ్ గ్రౌండ్ పక్కన ఉన్న రోడ్‌లో, సిటీవో నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే వెహికిల్స్‌ను అనుమతించరు.
ప్లాజా క్రాస్ రోడ్ నుంచి ఎస్బీహెచ్ క్రాస్ రోడ్‌ను పూర్తిగా క్లోచ్ చేస్తారు. వైఎంసీఏ ఫైఓవర్ నుంచి మాత్రమే ట్రాఫిక్‌ను అనుమతిస్తారు.
బోయిన్‌పల్లి, తాడ్ బండ్ నుంచి టివోలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను బ్రూక్ బాండ్ వద్ద సీటీవో వైపు మళ్లించనున్నారు.
కార్ఖానా, జేబీఎస్ నుంచి ఎస్బీహెచ్ ప్యాట్నీ వైపు వచ్చే ట్రాపిక్‌ను స్వీకార్-ఉపకార్ వద్ద టీవోలీ, బ్రూక్ బాండ్ వైపు మళ్లించనున్నారు.
ఎస్బీహెచ్ నుంచి వచ్చే వెహికిల్స్‌ను స్వీకార్-ఉపకార్ వైపు అనుమతించరు.
ఆర్టీఏ తిరుమలగిరి, కార్ఖానా, మల్కాజిగిరి, సఫిల్‌గూడ నుంచి ప్లాజా వైపు వచ్చే ట్రాఫిక్‌ను టివోలీ వద్ద దారి మళ్లించి స్వీకార్- ఉపకార్, వైఎంసీఏ లేదా బ్రూక్ బాండ్, బాలంరాయి, సీటీవో మీదుగా పంపిస్తారు. టివోలీ క్రాస్ రోడ్ నుంచి ప్లాజా క్రాస్ రోడ్ రూట్‌ను రెండు వైపులా మూసివేయనున్నారు.
ఇక పబ్లిక్ గార్డెన్స్ ప్రాంతంలోనూ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు జరగనున్న క్రమంలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు చేపట్టారు.












Click it and Unblock the Notifications