హస్తినబాట: 3 మంత్రుల పయనం.. కేంద్రమంత్రులతో వరస భేటీలు
వరి ధాన్యం కొనుగోలు అంశం దుమారం రేపుతుంది. కొనాలని సీఎం కేసీఆర్ కోరడం.. రా రైస్ కొంటామని కేంద్రం చెప్పడం చకచకా జరిగిపోయాయి. టీఆర్ఎస్ఎల్పీలో నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అనుకున్న విధంగా మంత్రులు ఢిల్లీ బయల్దేరారు. ఇదే విషయం కేంద్ర పెద్దలకు చెప్పడం.. తర్వాత ఆందోళన చేయడంలో టీఆర్ఎస్ శ్రేణులు మునిగిపోయారు.
యాసంగిలో తెలంగాణలో పండే మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ముగ్గురు మంత్రులతో కూడిన తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీ ఫ్లైటెక్కింది. ఈ బృందంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నారు.

ఢిల్లీకి చేరుకున్న మరుక్షణమే అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను వీరు కలుస్తారు. ధాన్యం కొనుగోళ్లపై వారితో చర్చిస్తారు. పంజాబ్, హర్యానాల్లో పండిన మొత్తం ధాన్యాన్ని కొంటున్న కేంద్రం తెలంగాణ ధాన్యం విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్న తీరుపై వారు కేంద్ర మంత్రులను నిలదీయనున్నారు. వాస్తవ పరిస్థితులను కేంద్ర మంత్రుల ముందు ఉంచనున్న తెలంగాణ మంత్రులు.. వీలయినంతమేరకు మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ఒప్పించే దిశగా తమ వంతు యత్నాలు చేయనున్నారు.
మరోవైపు దేశంలో మార్పు అవసరం.. .కొత్త జాతీయ పార్టీ రావొచ్చు.. తమది బీజేపీకి వ్యతిరేక ఫ్రంట్ కాదు.. ప్రజల మేలుకోరే రాజకీయ ఫ్రంట్ అని కేసీఆర్ టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో అన్నారు. అద్భుతంగా కొత్త రాజకీయ పార్టీ రావొచ్చని హింట్ ఇచ్చారు. భవిష్యత్ లో ఏం జరుగుతుందో చూడాలన్నారు. జాతీయ రాజకీయాల్లో తాను కీలక పాత్ర పోషిస్తానని మరోసారి తెలిపారు. యూపీఏ ప్రభుత్వం కంటే దారుణమైన పరిస్థితులు దేశంలో ఉన్నాయని వెల్లడించారు. బీజేపీ పరిస్థితి దిగజారిపోతోందని, ఇప్పటికే దేశం ఒక నిర్ణయానికి వచ్చిందన్నారు. 75 ఏళ్లలో చాలా సమస్యలు ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీపై ప్రజలు విసుగు చెందితే.. బీజేపీకి పట్టం కట్టారన్నారు. 8 బడ్జెట్‌ను ప్రవేశపెట్టినా దేశంలో ఏమి జరగలేదన్నారు. కరెంటు, నీటిపారుదల, ఆర్థిక అభివృద్ధి.. ఏ రంగం అభివృద్ధి చెందిందా ? అని ప్రశ్నించారు.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications