మోగిన మున్సిపల్ నగారా, 7న నోటిఫికేషన్, 8 నుంచి నామినేషన్ల స్వీకరణ
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జనవరి 7వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని పేర్కొన్నది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
జనవరి 5వ తేదీన మేయర్లు, మున్సిపల్ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తామని తెలిపింది. 6వ తేదీన వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తామని వెల్లడించింది.

జనవరి 8 నుంచి పదో తేదీ వరకు నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించారు. జనవరి 11వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. జనవరి 12, 13వ తేదీల్లో తిరస్కరణకు గురైన నామినేషన్లకు సంబంధించి అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించింది.
నామినేషన్ల విత్ డ్రాకు జనవరి 14వ తేదీ గడువు విధించింది. ఆ రోజు మధ్యాహ్నాం 3 గంటల వరకు పోటీలో ఉన్నవారి జాబితా విడుదల చేస్తారు. జనవరి 22వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. జనవరి 25వ తేదీన మున్సిపిల్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుందని పేర్కొన్నది.












Click it and Unblock the Notifications