పోలీస్ నియామకాల్లో కేటుగాళ్ల లీలలు
Recommended Video

హైదరాబాద్ : పోలీసుల నియామక ప్రక్రియలో తప్పు దొర్లింది. కన్సల్టెన్సీ ఉద్యోగి కన్నింగ్ బుద్ధి.. అసలు అభ్యర్థుల ఉద్యోగాలకు ఎసరు తెచ్చింది. ఫిజికల్ టెస్టులో అర్హత సాధించని అభ్యర్థులతో కుమ్మక్కై డబ్బులకు ఆశపడ్డాడు. కష్టపడి అర్హత సాధించిన అసలైన అభ్యర్థులకు గండి కొట్టేలా ప్లాన్ చేశాడు. అయితే ఉన్నతాధికారులు సకాలంలో మేల్కొవడంతో.. సదరు మోసగాడి ఆటలకు చెక్ పెట్టినట్లైంది. లేదంటే అనర్హులు పోలీస్ కొలువుల్లో దూరిపోయేవారు.
పోలీసుల నియామక ప్రక్రియలో ఫిజికల్ టెస్ట్ ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అభ్యర్థుల శారీరక కొలతలతో పాటు హైజంప్, రన్నింగ్ తదితర ఈవెంట్లలో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన తంతు కంప్యూటర్లలో పొందుపరిచే బాధ్యతను ఈ - సాఫ్ట్ అనే కన్సలెన్ట్సీకి అప్పగించారు. అందులో పనిచేసే ఉద్యోగి బానోతు నాగు బుద్ధి వక్రీకరించి అక్రమాలకు తెరలేపాడు. అనర్హుల జాబితా నుంచి ఫోన్ నెంబర్లు తీసుకున్నాడు. తన బంధువు బుక్యా రమేశ్ ను ఏజెంట్ గా నియమించుకుని వసూళ్లకు పాల్పడ్డాడు.

ఫిజికల్ టెస్టులో అర్హత సాధించని అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకుని అక్రమాలకు తెరలేపాడు నాగు. అర్హత సాధించిన వారి జాబితాలోకి వీరి పేర్లు ఎంటర్ చేశాడు. దానికోసం జంగ శామ్యూల్, ముత్తమల్ల కిరణ్ కుమార్, గాదె జగద్గిరి అనే ముగ్గురి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున ఆరు లక్షలు తీసుకున్నాడు. అయితే ఈ కేటుగాడి లీలల్ని ఆదిలోనే పసిగట్టారు తెలంగాణ పోలీస్ నియామక మండలి అధికారులు. సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ డీల్ తో సంబంధమున్న ఐదుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. 2 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications