తెలంగాణ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రం..! కొడంగ‌ల్ లో కేటీఆర్, సిరిసిల్ల‌లో రేవంత్ రెడ్డి..! కాయ్ రాజా కాయ్

హైద‌రాబాద్ : తెలంగాణ రాజ‌కీయాలు ర‌సంకందాయంలో ప‌డుతున్నాయి. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌ల ఘ‌ట్టం కూడా పూర్తికావ‌డంతో వ్యూహాలు ప్ర‌తివ్యూహాల్లో ప‌డిపోయారు ముఖ్య‌నేత‌లు. ముఖ్యంగా అదికార ప్ర‌తిప‌క్ష నేత‌ల నియోజ‌క‌వ‌ర్గాల మ‌ద్య ప్ర‌ఛ్చ‌న్న యుద్దం నెల‌కొంది. ఇక కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ రేవంత్ రెడ్డి, అదికార పార్టీ నేత‌ల మ‌ద్య కురుక్షేత్ర వాతావ‌ర‌ణం నెకొంది. రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఓడించేందకు మంత్రి కేటీార్ రంగంలోకి దిగుతుండగా సిరిసిల్ల నియోజక వర్గంలో కేటీార్ ను ఓడించేందుకు రేవంత్ రెడ్డే స్వయంగా రంగంలో దిగుతుండడం విశేషం. దీంతో తెలంగాణ రాజకీయాలు నువ్వా నేనా అన్నట్టు నడుస్తున్నాయి.

అభ్యర్థుల మద్య ప్రఛ్చన్న యుద్దం.. తెలంగాణలో వేడెక్కిన రాజకీయం..

అభ్యర్థుల మద్య ప్రఛ్చన్న యుద్దం.. తెలంగాణలో వేడెక్కిన రాజకీయం..

తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా అయిపోవడంతో పార్టీలన్నీ పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటి వరకు అభ్యర్థుల ఎంపిక, టికెట్ల కేటాయింపు, అసంతృప్తుల బుజ్జగింపులతో బిజీ బిజీగా గడిపిన పార్టీలు.. ఇక ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నాయి. అసెంబ్లీని రద్దు చేసినప్పటి నుంచే అంతా ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. రాష్ట్రంలోని అన్ని పార్టీలకంటే కొంచెం ముందుందనే చెప్పాలి.

ప్రచారంలో కూటమి వెనుకంజ.. ఐనా గట్టి పోటీ ఉస్తున్న ప్రతిక్షాలు.

ప్రచారంలో కూటమి వెనుకంజ.. ఐనా గట్టి పోటీ ఉస్తున్న ప్రతిక్షాలు.

మిగిలిన పార్టీలన్నింటితో పోలిస్తే మహాకూటమి కొంత వెనకుంది. పొత్తులు ఎప్పుడో ఖరారైనా సీట్ల సర్ధుబాటు మాత్రం ఆలస్యమవడంతో ఆయా పార్టీలలోని అభ్యర్థులకు ప్రచారం చేసుకునేందుకు తక్కువ సమయమే దొరికింది. దీనినే ఉపయోగించుకుని ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. కూటమిలో పెద్దన్న పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లను కాదని, రాహుల్ గాంధీ కొన్ని పనులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డికి అప్పజెప్పారు. అసలే దూకుడు స్వభావమున్న రేవంత్.. అధిష్ఠానం ఇచ్చిన బాధ్యతలను చక్కగా వాడుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇదే సందర్భంలో ఓ స్థానాన్ని టార్గెట్‌ చేశాడు.

 రేవంత్ ఇలాకాలో కేటీ ఆర్.. సిరిసిల్లలో రేవంత్ రెడ్డి..

రేవంత్ ఇలాకాలో కేటీ ఆర్.. సిరిసిల్లలో రేవంత్ రెడ్డి..

తెలంగాణ ఫైర్ బ్రాండ్ అని పేరు తెచ్చుకున్న రేవంత్‌ను టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసిందనేది బహిరంగ రహస్యమే. అందుకే ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ టీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన రేవంత్‌ను ఓడించడానికి టీఆర్ఎస్ చాలా ప్లాన్లు చేసింది. అక్కడ బలమైన అభ్యర్థిని దించడంతో పాటు, మంత్రి హరీశ్‌కు ఆ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. మరో మంత్రి కేటీఆర్ సైతం ఈ స్థానంపై కన్నేసి ఉంచగా, స్వయంగా కేసీఆరే ఇక్కడి పరిస్థితులపై దృష్టి సారిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో రేవంత్.. తన నియోజకవర్గ ప్రజలను కలిసి అన్ని చక్కదిద్దుకున్నాడు. అంతేకాదు, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లను టార్గెట్ చేశాడు.

సిరిసిల్లలో రేవంత్ ప్రచారం.. కీటీఆర్ కి వ్యతిరేకంగా రేవంత్ ప్రచారం..

సిరిసిల్లలో రేవంత్ ప్రచారం.. కీటీఆర్ కి వ్యతిరేకంగా రేవంత్ ప్రచారం..

సిరిసిల్ల‌లో ఎలాగైనా కేటీఆర్‌ను ఓడించాలనే తలంపుతో వ్యూహాలు సిద్ధం చేస్తున్నాడు. సిరిసిల్లలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా న్యాయవాది కేకే మహేందర్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. 2009లో కేకే మహేందర్‌ రెడ్డి సిరిసిల్ల నియోజకవర్గం నుంచి కేటీఆర్‌పై టీఆర్‌ఎస్‌ రెబల్‌గా పోటీచేసి 171 ఓట్ల స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. 2010లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ కేటీఆర్‌పై ఓడిపోయారు. 2014లో ఆయనకు కాంగ్రెస్‌ టిక్కెట్‌ దక్కలేదు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థిగా మళ్లీ కేటీఆర్‌తో తలపడుతున్నారు. దీంతో రేవంత్ ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఇందుకోసం బహిరంగ సభతో పాటు ప్రచారం నిర్వహించబోతున్నారు. దీంతో సిరిసిల్ల తో పాటు కొడంగల్ రాజకకీయాలు మరింత వేడెక్క నున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+