విదేశీ ప్రయాణికులకు తెలంగాణలో 'క్వారెంటైన్' సడలింపు.... తాజా మార్గదర్శకాలివే...
విదేశాల నుంచి తెలంగాణకు వచ్చే ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం క్వారెంటైన్ నిబంధనలను సడలించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇటీవలి మార్గదర్శకాలకు అనుగుణంగా లక్షణాలు లేనివారికి క్వారెంటైన్ నిబంధనల నుంచి సడలింపులనిచ్చింది.
తాజా మార్గదర్శకాల ప్రకారం... విదేశాల నుంచి తెలంగాణకు వస్తున్న విమాన ప్రయాణికులు 4 రోజుల్లోపు రిటర్న్ టికెట్స్ కలిగి... అక్కడినుంచి బయలుదేరడానికి ముందు 96 గంటల్లోపు నిర్వహించిన RT-PCR నెగటివ్ సర్టిఫికెట్‌ను కలిగి ఉంటే వారికి ఎలాంటి క్వారెంటైన్ ఉండదు. వారు నేరుగా తమ కార్యకలాపాలు చూసుకుని తిరిగి తమ దేశానికి బయలుదేరవచ్చు.

విదేశాల నుంచి బయలుదేరడానికి 96 గంటల ముందు నిర్వహించిన నెగిటివ్ RT- PCR పరీక్ష రిపోర్టుతో ప్రయాణిస్తున్న వ్యాధి లక్షణాలు లేని (అసింప్టమాటిక్) ప్రయాణికులను కూడా సంస్థాగత క్వారంటైన్ నుంచి మినహాయించారు. వారు కేవలం 14 రోజుల హోమ్ క్వారంటైన్‌లో ఉండాలి.
విదేశాల నుంచి బయలుదేరడానికి 96 గంటల ముందు నిర్వహించిన నెగిటివ్ RT- PCR సర్టిఫికెట్ లేకుండా తెలంగాణకు వచ్చే కరోనా లక్షణాలు లేనివారిలో.. కొన్ని విభాగాల వారికి మాత్రం హోమ్ క్వారెంటైన్ తప్పనిసరి చేశారు. ఇందులో మహిళలు,10 ఏళ్ల లోపు చిన్నారులతో ప్రయాణించే తల్లిదండ్రులు,ఆరోగ్య సమస్యలతో వచ్చేవారు ఉన్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం యూకె,యూఏఈలతో ఎయిర్ బబుల్ ఒప్పందాలను కలిగి ఉంది. ఇప్పటికే బ్రిటీష్ ఎయిర్‌లైన్స్ హైదరాబాద్-లండన్ మధ్య వారానికి నాలుగుసార్లు విమాన సర్వీసులను నడుపుతోంది. త్వరలోనే యూఏఈ,ఎమిరేట్స్&ఫ్లైదుబాయ్,ఎతిహాద్ విమాన సర్వీసులు కూడా పునరుద్దరించే అవకాశం ఉంది.
వందే భారత్ మిషన్ కింద విదేశాల నుంచి హైదరాబాద్‌కు విదేశీ ప్రయాణికులు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మిషన్ కింద నిబంధనలకు లోబడి చార్టర్ విమానాలు,ఎయిర్ ఇండియా విమానాలు,విదేశీ ఎయిర్‌లైన్స్ సర్వీసులను నడుపుతున్నాయి. లాక్‌డౌన్ మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ విదేశాల్లో చిక్కుకుపోయిన 55,000 మంది హైదరాబాద్ తిరిగి వచ్చారు. అలాగే వివిధ దేశాలకు చెందిన 10,000 పైచిలుకు మంది హైదరాబాద్ నుంచి తమ దేశాలకు తిరిగి వెళ్లిపోయారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications