చలి పులి: తెలంగాణలో పంజా.. రాత్రి ఎక్కువగా

తెలంగాణ రాష్ట్రలో చలి కూడా పెరిగింది. మొన్నటి వరకు వానలు కురిసినట్టే ఉన్నా.. సడెన్‌గా చలి పెడుతుంది. ఉదయం మంచు దుప్పటి కమ్ముకుంటుంది. సాయంత్రం వేళ ఇక చెప్పక్కర్లేదు. 5.30 దాటితే చాలు ఈదర పెడుతుంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పూర్తిగా మారిపోయాయి. వాతారణం పూర్తిగా చల్లబడింది. గత మూడు రోజుల నుంచి రాత్రి పూట చలి తీవ్రంగా ఉంటోంది.

12 డిగ్రీలు

12 డిగ్రీలు

కొన్ని జిల్లాలలో రాత్రి ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు పడిపోయాయి. వాతావరణ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ లో అత్యల్పంగా 12.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. బోథ్, బజర్హత్నూర్‌లలో 12.6 డిగ్రీలు, గడిగూడలో 12.8 డిగ్రీలు, కేరమేరిలో 12.9 డిగ్రీలు, పొచర, తలమడుగులో 13, సిర్పూర్ లో 13.1, రామ్ నగర్, థాంసీలలో 13.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌తోపాటు పలు ఇతర జిల్లాల్లో కూడా చలి వణికిస్తోంది. మరికొన్ని రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతాయని అధికారులు తెలియజేశారు. చలి సీజన్ ఇప్పుడే స్టార్ట్.. కాగా ఈ నెల.. డిసెంబర్‌లో ఎక్కువగా ఉంటుంది.

చల్లబడిన వాతావరణం

చల్లబడిన వాతావరణం


తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతోంది. ఉదయం కాస్త ఎండగా ఉన్నా..మధ్యాహ్నం అయ్యేసరికి మాత్రం చల్లగా అయిపోతోంది. తూర్పుగాలుల ప్రభావం, ఉపరితల ద్రోణి కారణమని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. చలికాలం కూడా స్టార్ట్ అయ్యింది. డిసెంబర్, జనవరిలో ఎక్కువగా ఉంటుంది. ఫిబ్రవరిలో కొద్దీరోజులు కూడా చలి ప్రభావం ఉంటుంది. ఆ తర్వాతే వేసవి ప్రారంభం అవుతుంది.

రెండు డోసులు

రెండు డోసులు


సమ్మర్ స్టార్ట్ అయిన ఫరావాలేదు.. కానీ గతేడాది కరోనా అల్లాడించింది. మరీ ఈ సారి ఎలా ఉంటుందనే ఆందోళన ఉంది. దాదాపు అందరు వ్యాక్సిన్ తీసుకున్నారు. రెండు డోసులు పూర్తయితే కానీ ఏం జరుగుతుందో చెప్పలేం. కొందరు నిపుణులు మాత్రం.. బూస్టర్ డోసు తీసుకోవాల్సిందేనని కోరుతున్నారు. బూస్టర్ డోసు తీసుకుంటే.. కరోనా దరి చేరదని వారు చెబుతున్నారు. సో సమ్మర్ లోపు దేశంలో అందరూ.. రెండు డోసులు తీసుకుంటే.. వైరస్ గురించి భయపడాల్సిన అవసరం ఉండదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+