Severe Rainfall Alert: 3 రోజులు వర్షాలు.. చలి గాలులు కూడా
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతోంది. ఉదయం కాస్త ఎండగా ఉన్నా..మధ్యాహ్నం అయ్యేసరికి మాత్రం చల్లగా అయిపోతోంది. తూర్పుగాలుల ప్రభావం, ఉపరితల ద్రోణి కారణమని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. తూర్పు గాలులతో ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని, ఉత్తర కోస్తా ఆంధ్రా తీరం వరకు ఉపరితల ద్రోణి బలహీన పడిందన్నారు.
శుక్రవారం ఆగ్నేయ బంగళాఖాతం పరిసర ప్రాంతాల్లోని శ్రీలంక, తమిళనాడు తీరాల్లో ఉన్న అల్పపీడనం శనివారం కూడా కంటిన్యూ అవుతోందన్నారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 3.1 కి.మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి స్థిరంగా కొనసాగుతూ ఉందన్నారు. రాగల 3 నుంచి 4 రోజుల్లో పశ్చిమ దిశ వైపు నెమ్మదిగా ప్రయాణించే అవకాశం ఉందని తెలిపారు. ఈశాన్య దిశ నుండి తెలంగాణా రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నట్లు వెల్లడించారు.

శనివారం, ఆదివారాల్లో తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడా మరియు ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. సోమవారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, తూర్పు గాలులు ప్రభావం వల్ల నవంబర్ నెల 02, 03 తేదీల్లో కొన్ని జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇటు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షపాతం ఎక్కువే నమోదు అవుతుంది. ఇప్పటికే ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. వర్ష బీభత్సం ఇలానే కొనసాగితే.. ప్రాజెక్టులు గరిష్ట నీటిమట్టానికి చేరుకునే అవకాశం ఉంది. పంటలకు వానాకాలం, యాసంగి పంటలకు నీరు సమృద్ధిగా లభించే పరిస్థితులు ఉన్నాయి.












Click it and Unblock the Notifications