అదృష్టం వరించడమంటే ఇదే: లాటరీలో తెలంగాణ యువకుడికి రూ. 30 కోట్లు
హైదరాబాద్: తెలంగాణకు చెందిన యువకుడికి రూ. 30 కోట్ల లాటరీ రూపంలో అదృష్టం వరించింది. దీంతో ఆ యువకుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఏకంగా రూ. 30 కోట్ల లాటరీ తగలడంతో తెలంగాణలోని జగిత్యాలకు చెందిన సామాన్య యువకుడు ఇప్పుడు కోటీశ్వరుడయ్యాడు.
వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగుర్‌కు చెందిన ఓగుల దేవరాజం బతుకుదెరువు కోసం నాలుగేళ్ల క్రితం దుబాయ్‌కి వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడ 15 దిర్హమ్స్‌తో రెండు లాటరీ టికెట్లు కొన్నాడు. అయితే, డ్రాలో లాటరీ తీయగా అదృష్టం అతడ్నే వరించింది.

ఓ టికెట్‌లో 1.50 కోట్ల దిర్హమ్స్‌ను అజయ్ గెలుచుకున్నాడు. దీని విలువ ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.30 కోట్లు. ఈ విషయాన్ని అజయ్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. దీంతో కుటుంబసభ్యులు కూడా ఆనందంలో మునిగిపోయారు.

కాగా, ఇప్పటికి తాను జాక్ పాట్ కొట్టినట్టుగా నమ్మలేకపోతున్నానని అన్నాడు అజయ్. అంతేగా, ఈ మొత్తంలో కొంత కుటుంబానికి వెచ్చించి, మిగతా డబ్బుతో సొంత ప్రాంతంలో ఉంటూ వ్యాపారం చేస్తానని అజయ్ చెప్పుకొచ్చాడు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications