Hyderabad: శుభవార్త చెప్పిన వాతావరణ శాఖ.. హైదరాబాద్ లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..

హైదరాబాద్ లో మంగళవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని భారతీయ వాతావరణ శాఖ తెలిపింది. తేలిపాటి నుంచి మోస్తారు వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాలతో పాటు పిడుగులు, మెరుపులు, ఈదురగాలులు వచ్చే అవకాశం ఉందని వివరించింది. మే 11 వరకు ఇలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది.

ఇప్పటికే సోమవారం రాత్రి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వానలు పడ్డాయి. దమ్మయిగూడ, కోంపల్లి పాటు పలు ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గుతోన్నాయి. దక్షిణ తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి.

Temperatures are likely to drop due to rain in Hyderabad

హైదరాబాద్ తో పాటు తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా వర్షం పడే అవకాశం ఉందని వాతారవరణ శాఖ పేర్కొంది.
వర్షం వల్ల తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్ కు తగ్గే అవకాశం ఉందని వివరించింది. అయితే నిన్నటి నుంచి తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) గణాంకాల ప్రకారం జగిత్యాలలో అత్యధికంగా అంటే 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

హైదరాబాద్ విషయానికొస్తే, అత్యధికంగా షేక్‌పేటలో 43.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పక్క రాష్ట్రంలో ఏపీలో కూడా వానలు పడే అవకాశ ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+