హైదరాబాదీలకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్
హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుడ్‌న్యూస్ చెప్పింది. ట్రాఫిక్ ఇబ్బందులను తప్పించేందుకు హైదరాబాద్‌లో ఆర్టీసీ పికప్ వ్యాన్‌లను సేవలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. తొలి విడతలో ఈసీఐఎల్-ఎల్బీనగర్ మధ్య ఉన్న ప్రాంతాల నుంచి ఈ పికప్ వ్యాన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు.
దూర ప్రాంత ప్రయాణికుల కోసం ఆర్టీసీ ఈ పికప్ వ్యాన్ సేవలను తీసుకొచ్చింది. విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు, కందుకూరు వెళ్లేవారి కోసం ఈ పికప్ వ్యాన్‌లు ఏర్పాటు చేశారు. కాప్రా మున్సిపల్ కాంప్లెక్స్, మౌలాలీ హెచ్‌బీ కాలనీ, మల్లాపూర్, హెచ్ఎంటీ నగర్, నాచారం, హబ్సిగూడ, ఉప్పల్ మెట్రో స్టేషన్, నాగోల్, సుప్రజ ఆస్పత్రి, ఎల్బీనగర్ ఎల్పీటీ మార్కెట్ నుంచి పికప్ వ్యాన్లు అందుబాటులో ఉంటాయి.

కాగా, ప్రయాణికులు ముందస్తు టికెట్లను బుక్ చేసుకునేందుకు www.tgsrtcbus.inలో బుక్ చేసుకోవాలి. అలాగే సమీప ఏటీబీ ఏజెంట్ల వద్ద గానీ, ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్నగర్ బస్ స్టేషన్లలో సీట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ సేవలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం 040-69440000, 04023450033 నెంబర్లను సంప్రదించాలని టీజీఎస్ఆర్టీసీ సూచించింది.
కాగా, ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారికి శుభవార్త చెప్పింి. అన్ని ఏసీ బస్సుల టికెట్లపై 10 శాతం తగ్గించినట్లుగా ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ ఆఫర్ ఏసీ స్లీపర్, ఏసీ సీటర్- స్లీపర్, రాజధాని బస్సుల్లో అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకే ఈ ఆఫర్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులు ఆఫర్ వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం టీజీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలని సూచించారు.












Click it and Unblock the Notifications