Fact Check: ఆ వీడియోపై టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్..!
సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు కొంత మంది వింత వింత పనులు చేస్తున్నారు. తాజాగా యూసుఫ్‌గూడ మెయిన్ రోడ్డులో కదులుతున్న బస్సు ముందు ఓ యువకుడు పడుకున్నట్లు.. అతని పై నుంచి బస్సు వెళ్లినట్లు.. అతను బస్సు చక్రాల కింద కాకుకండా మధ్యలో పడుకున్నట్లు వీడియోలో ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ వీడియో ఫేక్ అని తెలిపింది.
దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. "సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఫేక్. ఇది పూర్తిగా ఎడిట్ చేసిన వీడియో. సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి కొందరు ఇలాంటి వీడియోలను ఎడిట్ చేస్తున్నారు. ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించడం మంచి పద్ధతి కాదన్నారు. లైక్‌లు, కామెంట్‌ల కోసం చేసే ఈ రకమైన అనాలోచిత చర్యలను ఇతరులు అనుకరించే ప్రమాదం ఉంది. వినోదం కోసం రూపొందించిన ఎడిట్ చేసిన వీడియోలు ఇతరులకు కూడా హాని కలిగిస్తాయి" అని ట్వీచ్ చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో ఫేక్. ఇది పూర్తిగా ఎడిటెడ్ వీడియో. సోషల్ మీడియాలో పాపులర్ కోసం కొందరు ఇలా వీడియోలను ఎడిట్ చేసి వదులుతున్నారు. ఇలాంటి వెకిలిచేష్టలతో ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదు. లైక్ లు, కామెంట్‌ల కోసం చేసే ఈ తరహా… pic.twitter.com/Eia1GCSxyr
— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) June 21, 2024
ఈ ఘటనలను టీజీఎస్‌ఆర్‌టీసీ యాజమాన్యం సీరియస్‌గా తీసుకుని బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ వీడియో నిజమైందని చాలా మంది సోషల్ మీడియాలో షేరు చేశారు. దీనిపై చాలా మంది నెటిజన్లు స్పందించారు. ఈ వీడియో నిజమైతే.. వారి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే సోషల్ మీడియా వీడియోలు షేరు చేసేటప్పుడు ముందు వెనక చూసుకోవాలని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications