ఇంట్లోనే ఉన్నా.. ట్వీట్ చూసి ఆశ్చర్యపోయా.. పబ్ డ్రగ్స్ గురించి గల్లా అశోక్

బంజారాహిల్స్ పబ్ డ్రగ్ కేసు దుమారం రేపుతోంది. ఇందులో ప్రముఖుల పేర్లు వచ్చాయి. దీంతో అంతా స్పందిస్తున్నారు. మాజీ ఎంపీ గల్లా జయదేవ్.. కుమారుడు గల్లా అశోక్ పేరు కూడా వినిపించింది. దీంతో ఆయన స్పందించారు. అశోక్ కూడా స్పందించారు. అంతా తూచ్ అని చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టులు కొనసాగాయి. సీఐ నాగేశ్వరరావు విచారణ కూడా చేస్తున్నారు.

లేట్ నైట్ పబ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో బంజారాహిల్స్ రాడిసన్‌ బ్లూ హోటల్‌లో గల ఫుడింగ్‌ మింగ్‌ పబ్‌పై పోలీసులు రైడ్‌ చేశారు. పోలీసులు వెళ్లేసరికి దాదాపు 150 మంది యువతీ యువకులు పార్టీలు చేసుకుంటున్నారు. డ్రగ్స్ కూడా బయటపడటంతో పబ్‌ నిర్వాహకులతోపాటు 150 మంది యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పేర్లు వినిపించిన సెలబ్రిటీలు, వారి కుటుంబ సభ్యులు కొంతమంది దీనిపై స్పందించారు.

 that time iam in home: galla ashok

నటుడు మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ పెద్దకొడుకు, హీరో గల్లా అశోక్ పేరు కూడా వినిపించింది. తర్వాత అది అశోక్ తమ్ముడు గల్లా సిద్దార్థ్ అని అంటున్నారు. ఇప్పటికే దీనిపై గల్లా జయదేవ్ మాట్లాడారు. కావాలనే తమ పేర్లు చెప్తున్నారని.. ఘటనతో ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదు అని తెలిపారు. గల్లా అశోక్ కూడా మాట్లాడారు. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

పబ్‌ ఇష్యూలో తన పేరు ఎందుకు వచ్చిందో తెలియదు. ఆ రోజు తాను ఫిజియోథెరపీ చేయించుకుని ఇంట్లోనే ఉన్నాను. ఎవరో నాకు ట్విటర్‌ లింక్‌ పంపితే చూసి షాకయ్యాను. అప్పుడు అనిపించింది సెలబ్రిటీల లైఫ్స్‌ ఇలానే ఉంటాయా, అనవసరంగా వార్తల్లో పేర్లు రాస్తారా అని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+