కొడంగల్ ఓటమి కసిని మల్కాజ్ గిరిలో చూపించేందుకు సిద్ధమవుతున్న రేవంత్‌రెడ్డి?

Recommended Video

    Election 2019 : కొడంగల్ ఓటమికి... ప్రతీకారం తీర్చుకోనున్న రేవంత్...!! | Oneindia Telugu

    హైద‌రాబాద్ : పోయిన చోటే వెతుక్కోవాలి. శ‌త్రువుని దెబ్బ‌కొట్టాలి. ఇదీ కాంగ్రెస్ పార్టీనేత రేవంత్ రెడ్డి వ్యూహం. ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు.. 30 ల‌క్ష‌ల ఓట‌ర్లు.. 20 మందికి పైగా పోటీప‌డే అభ్య‌ర్థులు. ఇదీ మ‌ల్కాజిగిరి పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిస్థితి. 2009లో ఏర్ప‌డిన పార్ల‌మెంట‌రీ స్థానాన్ని తొలుత కాంగ్రెస్ అభ్య‌ర్థి స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ గెల‌చుకున్నారు. 2014లో టీడీపీ త‌ర‌పున బ‌రిలోకి దిగిన మ‌ల్లారెడ్డి జ‌య‌కేత‌నం ఎగుర‌వేశారు. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత జ‌రిగిన ఎన్నిక‌లు కావ‌టంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మారిన నియోజ‌క‌వ‌ర్గంలో స‌త్తా చాటుకునేందుకు మాజీ ఐపీఎస్ అధికారి దినేష్‌రెడ్డి, లోక్‌స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాశ్‌నారాయ‌ణ్‌, కె.నాగేశ్వ‌ర్ వంటి పెద్ద‌త‌ల‌లూ పోటీప‌డ్డాయి. మైనంప‌ల్లి హ‌న్మంతురావు కేవలం 2 శాతం ఓట్ల‌తో ఓట‌మి చ‌విచూశారు.

    పోయిన చోటే అందిపుచ్చుకోవాలి..! మ‌ల్కాజిగిరిలో రేవంత్ వ్యూహం ఏంటి..?

    పోయిన చోటే అందిపుచ్చుకోవాలి..! మ‌ల్కాజిగిరిలో రేవంత్ వ్యూహం ఏంటి..?

    ప్ర‌స్తుతం అదేచోట కాంగ్రెస్ త‌ర‌పున రేవంత్‌రెడ్డి పోటీ ప‌డుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో అంత��మంది పోటీకు దిగినా రెండోస్థానం సాధించిన తెరాస ఈ ద‌ఫా ఏడు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో బ‌లంగా ఉంది. త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌తో దూకుడుమీద ఉంది. పైగా రేవంత్‌రెడ్డి కొడంగ‌ల్‌లో ఓట‌మి తీరు కాంగ్రెస్‌ను కాస్త కుంగ‌దీసింద‌నే చెప్పాలి. వాస్త‌వానికి రేవంత్ దూకుడుతో త‌మ‌కు క‌ల‌సివ‌స్తుంద‌ని కాంగ్రెస్ భావించింది. ముంద‌స్తు ఎన్నిక‌ల ముందు బాహుబ‌లిగా కీర్తించారు కూడా. త‌ర‌చూ ఎమోష‌న్‌కు గుర‌వుతూ కేసీర్‌ను ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పిస్తూ చివ‌రి నిమిషంలో విలువైన స‌మ‌యాన్ని నియోజ‌క‌వ‌ర్గానికి కేటాయించ‌కుండా చేసుకున్నాడు.

    బ‌లంగా ఉన్న గులాబీ పార్టీ..! గెలుపుపై ఉత్కంఠ‌..!!

    బ‌లంగా ఉన్న గులాబీ పార్టీ..! గెలుపుపై ఉత్కంఠ‌..!!

    కేసీఆర్ స‌భ‌ను అడ్డుకోవాల‌నే ఉద్దేశంతో త‌న ఓట‌మిని కోరి మ‌రీ తెచ్చుకున్నాడ‌నే అప‌వాదు మూట‌గ‌ట్టుకున్నాడు. ఒక విధంగా రేవంత్‌రెడ్డి ఎమోష‌న్‌��ు టీఆర్ఎస్ చ‌క్క‌గా ఉప‌యోగించుకుంది. అత‌డిని త‌ర‌చూ రెచ్చ‌గొడుతూ విచ‌క్ష‌ణ కోల్పోయేలా చేస్తుంద‌నే చెప్పాలి. రాజ‌కీయ అనుభ‌వం ఉన్న నేత‌గా ప‌రిణితి ప్ర‌ద‌ర్శించ‌క‌పోవ‌టం.. త‌ర‌చూ త‌న మాట‌ల‌తోనే ఓట్లు ప‌డ‌తాయ‌నే ఆలోచ‌న‌తో ఉండ‌టం కూడా రేవంత్‌రెడ్డి ఓట‌మికి కార‌ణాల‌య్యాయ‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

    ఏడు పార్ల‌మెంట‌రీ నియోజ‌క వ‌ర్గాల్లో టీఆర్ఎస్ ప‌టిష్టం..! రేవంత్ ప్లాన్ ఫ‌లిస్తుందా..?

    ఏడు పార్ల‌మెంట‌రీ నియోజ‌క వ‌ర్గాల్లో టీఆర్ఎస్ ప‌టిష్టం..! రేవంత్ ప్లాన్ ఫ‌లిస్తుందా..?

    ఓట‌ర్ల తీరులో కూడా చాలా మార్పు వ‌చ్చింది. అభివృద్ధి ప‌నుల వైపు ఆస‌క్తిచూపే నేత‌ల‌కు మాత్ర‌మే మ‌ద్ద‌తు ఇవ్వాల‌నే ఆలోచ‌న పెరిగింది. ఇలా చీటికి మాటికీ క‌య్యానికి కాలుదువ్వే నేత‌ల‌ను దూరం పెడుతున్న‌ట్టు తెలుస్తోంది. అటువంటి రేవంత్‌రెడ్డి మ‌ల్కాజిగిరిలో విజ‌యం సాధించ‌టం మామూలు విష‌యం కాదు. పైగా కాంగ్రెస్ పార్టీలో విభేదాలు, చీలిక‌లు, అంత‌ర్గ‌త మ‌రోవైపు వెంటాడుతూనే ఉన్నాయి. ఇటువంటి క్లిష్ట‌మైన స‌మ‌యంలో రేవంత్‌రెడ్డి ఎంత‌టి వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తాడ‌నే అంశం పై ఆస‌క్తి నెల‌కొంది.

    అవేశం త‌గ్గించుకోవాలంటున్న అభిమానులు..! గెలుపుకోసం అంద‌రూ క్రుషి చేయాలంటున్న నేత‌లు..!!

    అవేశం త‌గ్గించుకోవాలంటున్న అభిమానులు..! గెలుపుకోసం అంద‌రూ క్రుషి చేయాలంటున్న నేత‌లు..!!

    ఎందుకంటే గ‌తంలో పోటీచేసిన లోక్‌స‌త్తా, వైసీపీలు ఈ ద‌ఫా పోటీలో లేవు. కాబ‌ట్టి.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు ప‌డే అవ‌కాశం ఉంది. టీడీపీ త‌ర‌పునుంచి కూడా రేవంత్‌కు కాస్తో..కూస్తో అండ‌దండ‌లుంటాయి. అయితే.. త‌న‌ను తాను నియ‌త్రించుకుని, ప‌రిణితి చెందిన నేత‌గా.. జ‌నం వ‌ద్ద‌కు వెళ్తే రేవంత్‌రెడ్డికి మ‌ల్కాజిగిరిలో గెలుపు పెద్ద క‌ష్టం కాక‌పోవ‌చ్చ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+