వయసు పందొమ్మిదే..! కాని శాడిజంలో మాత్రం 90 ఏళ్ల అనుభవం.. చెత్త యెదవ..!

రంగారెడ్డి/హైదరాబాద్: పుర్రెకో బుద్ది, జిహ్వకో రుచి అన్నారు పెద్దలు. అలాగే వ్యక్తులకు ఉన్న అవలక్షణాలు కూడా అనేకం అని తెలుస్తోంది. సమాజంలో టీనేజ్ యువకుల నుండి మొదలు కొని, 60 ఏళ్ల వృద్దుల వరకూ ఏదో రూపంలో అభం శుభం తెలియని అబలలపైన తమ వికృత చేష్టలను ప్రదర్శిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ టీనేజ్ అమ్మాయిపై ఓ టీనేజ్ యువకుడి వింత డిమాండ్ అతని శాడిజానికి పరాకాష్టగా మారింది. పరిచయం అవ్వడమే పాపంగా పరిణమించిన వారి స్నేహం అమ్మాయి పాలిట శాపంగా మారింది.

దీంతో చేయకూడని పనులు చేస్తూ ఆ శాడిస్టు బాయ్ ఫ్రెండ్ చేతిలో రిమోట్ గా మారిపోయింది ఆ అమ్మాయి. ఇక అసలు విషయానికి వస్తే స్నేహం పేరుతో యువతికి దగ్గరైన యువకుడు ఆమె నగ్న ఫొటోలు పంపాలని వేధిస్తున్న ఘటన రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి పరిధిలో చోటు చేసుకుంది. నిజామాబాద్‌ జిల్లాకి చెందిన పందొమ్మిదేళ్ల మహమ్మద్ రయానుద్దీన్ అనే యువకుడు శంకర్‌పల్లిలోని ఓ కాలేజీ హాస్టల్‌లో ఉంటూ బీబీఏ చదువుతున్నాడు.

The age of Nineteen..! But 90 years experience in sadism..!!

కొద్ది రోజుల కిందట తన క్లాస్‌మెట్ అయిన ఓ పందొమ్మిదేళ్ల యువతి తో పరిచయం పెంచుకున్నాడు. స్నేహం పేరుతో ఆ యువతికి దగ్గరయ్యాడు. ఆమెతో సన్నిహితంగా మెలుగుతూ కొన్ని ఫొటోలు దిగాడు. ఏకాంతంగా ఉన్న సమయంలో సెల్ఫీలు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఇటీవల రయానుద్దీన్ యువతిని వేధించడం ప్రారంభించాడు. తనతో సినిమాలు, షికార్లకు రావాలని, తనకు నచ్చినట్లే నడుచుకోవాలని వేధించాడు. యువతి అతడితో దూరంగా మెలగడంతో గతంలో తీసుకున్న ఫొటో లతో బ్లాక్‌మొయిల్‌కు పాల్పడ్డాడు. యువతి తన నగ్న చిత్రాలను పంపించాలని తీవ్రంగా వేధింపులకు గురి చేశాడు.

పంపకపోతే సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఆమె తల్లిదండ్రులకు చేరవేస్తానని బెదిరించాడు. ఇటీవల యువతి తన తల్లిదండ్రులతో కలిసి సినిమాకి వెళ్లిన సందర్భంలో బాత్రూంకి వెళ్లి, నగ్న ఫొటోలు తీసి పంపాలని బలవంతం చేశాడు. దీంతో భయపడిన యువతి కొన్ని ఫొటోలు తీసి, వాట్సాప్ ద్వారా రయానుద్ధీన్‌కి పంపించింది. అయినప్పటికీ రయానుద్దీన్ వేధింపులు ఆగడం లేదు. దీంతో విసుగు చెందిన యువతి గత మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం రయానుద్దీన్ అదుపులోకి తీసుకొని, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్టు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+