Hyderabad: చేప ప్రసాదం పంపిణీకి అంతా సిద్ధం.. శుక్రవారం నుంచి పంపిణీ మొదలు..
మృగశిర కార్తి సందర్భంగా అస్తమా బాధితులకు బత్తిని కుటుంబీకులు చేప మందు వేస్తారు. ఈ సారి జూన్ 9 నుంచి చేప మందు పంపిణీ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందు పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. చేప మందు కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి అస్తమా వ్యాధిగ్రస్థులు తరలొస్తున్నారు.
కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్,మధ్యప్రదేశ్, బీహర్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, చత్తీస్ ఘఢ్ నుంచి అస్తమా బాధితులు వస్తున్నారు. ఇక్కడి వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆర్అండ్ బీ అధికారులు షెడ్లు, ఫ్లడ్ లైట్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యే బస్సులు నడపనున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు శానిటేషన్, జలమండలి మంచినీటి సరఫరా ఏర్పాట్లు చేయనున్నారు.

అస్తమా బాధితులు, వారి సహాయకులతో ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నిండిపోయింది. ఇక్కడి వచ్చే వారికి పలు స్వచ్ఛంద సంస్థలు ఆహారం, నీటిని అందిస్తున్నాయి. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఉచితంగా అందిస్తున్నాయి. పోలీసులు భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా జనాలు వస్తారని అంచనా ఉండడంతో పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహించున్నారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు. ఇటు అగ్నిమాపక సిబ్బంది కూడా ఎలాంటి ఘటనలు జరిగినా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉంది.
మరోవైపు చేప ప్రసాదం కోసం దేశవ్యాప్తంగా ఉన్న బాధితులు రైళ్లు, బస్సుల్లో హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. వీరు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఈ నెల 8 నుంచి 10 వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తూ ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు బుధవారం తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, ఎంజీబీఎస్, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు వంటి ప్రాంతాల నుంచి దాదాపు 50 ప్రత్యేక బస్సులు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఏర్పాడు చేశారు. మరో 14 ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు 80 బస్సులు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications