Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Khairathabad Metro Station: ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ గేట్లు మూసివేత..!

హైదరాబాద్ ట్యాంక్ బాండ్ వద్ద గణేష్ నిమజ్జనాలు కొనసాగుతోన్నాయి. హుస్సేన్ సాగర్ వద్ద జరగుతోన్న నిమజ్జనాలను చూసేందుకు ప్రజలు భారీగా తరలొస్తున్నారు. దీంతో జనంతో ట్యాంక్ బాండ్ కిక్కిరిసిపోయింది. వాహనాలపై వస్తే ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని చాలా మంది మెట్రో రైళ్లలో వస్తున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ మెట్రోలో భారీగా జనాలు వస్తున్నారు. మెట్రో మార్గాల గుండా హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకునే వారి సంఖ్య వేలల్లో ఉంది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ లో భారీగా రద్దీ నెలకొంది.

రద్దీని కంట్రోల్ చేయలేకపోయిన మెట్రో అధికారులు చివరకు మెట్రో స్టేషన్ గేట్లనే క్లోజ్ చేశారు. ప్రతి పదినిముషాలకు ఒకసారి మాత్రమే గేట్లను ఓపెన్ చేసి లోపలికి పంపుతున్నారు. పరిమిత సంఖ్యలో ప్రయాణికులను స్టేషన్ లోకి అనుమతి ఇస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ట్యాంక్ బాండ్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ఐమాక్స్ పరిసర ప్రాంతాలు జనాలు నిండిపోయారు. బస్ స్టాపులు, రైల్వే స్టేషన్లలో కూడ తీవ్ర రద్దీ నెలకొంది.

The gates of Khairatabad Metro station were closed due to heavy traffic

గణేషుల నిమజ్జనం నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం ముగిసింది. కాసేపట్లో బాలాపూర్ గణేషుడి నిమజ్జనం పూర్తి కానుంది. బాలాపూర్ నుంచి ఉదయం ప్రారంభమైన యాత్ర ప్రస్తుతం ఎంజే మార్కెట్ దాటింది. అబిడ్స్, బషీర్‌‌బాగ్‌, లిబర్టీ వై జంక్షన్‌ మీదుగా కాసేపట్లో ట్యాంక్​ బాండ్ ​కు చేరుకునే అవకాశం ఉంది. బాలాపూర్ గణనాథుడి లడ్డూ ఈసారి భారీ ధర పలికింది. కొలన్ శంకర్ రెడ్డి అనే వ్యక్తి బాలాపూర్ లడ్డు ప్రసాదాన్ని 30 లక్షల వెయ్యి రూపాయలకు దక్కించుకున్నాడు. గతేడాది కంటే ఈసారి 3 లక్షల రూపాయలు అదనంగా పలికింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+