Hyderabad: 3000 కిలోల కేక్.. మన హైదరాబాద్ లోనే..!
అనేక రకాల వరల్డ్ రికార్డ్స్‌ను బ్రేక్ చేసిన హైదరాబాద్ మరో అరుదైన ఫీట్‌కు సిద్ధమైంది. సిటీకి చెందిన హార్లీస్ ఇండియా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లక్ష్యంగా శుక్రవారం ఓ రికార్డు సృష్టించేందుకు ప్రయత్నించబోతోంది. 3,000 కిలోల రష్యన్ మెడోవిక్ హనీ కేక్‌ను తయారు చేస్తున్నట్లు హార్లీస్ ఇండియా ఫైన్ బేకింగ్ ప్రకటించింది. సృజనాత్మకతను, అత్యుత్తమమైన బేకింగ్ ఆవిష్కరణలను ప్రపంచానికి చాటి చెప్లేలా, స్వచ్ఛమైన తేనెతో కేక్ తయారు చేయనున్నారు.
7 అడుగుల వెడల్పు, 70 అడుగుల ఎత్తుతో దీన్ని తయారు చేయనున్నట్లు ప్రకటించారు. కేక్ తయారీలో గతంలో స్పిన్నీస్ దుబాయ్ రికార్డు సృష్టించింది.ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి అతి పెద్ద హనీ కేక్‌ను తయారు చేయడంలో ప్రపంచ రికార్డు సృష్టించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కాడు.
దుబాయ్‌లోని సూపర్ మార్కెట్ చైన్ స్పిన్నీస్‌లో పనిచేస్తున్న రఘునాథ్‌పూర్‌కు చెందిన ప్రీతం పట్నాయక్ తన 10 మంది సభ్యుల బృందం సహాయంతో కేక్‌ను తయారు చేశాడు.

ఈ తేనె కేక్ బరువు 275 కిలోలు ఉండగా.. పొడవు 4.8 మీటర్లు, వెడల్పు 1.08 మీటర్లుగా ఉంది. కేక్‌ను పూర్తి చేయడానికి వారికి మూడు రోజులు పట్టింది.కేక్‌లో కోడిగుడ్డు, పంచదార, ఆల్‌పర్పస్ మైదా, వెన్న, తేనె, క్రీమ్‌తో సహా దాదాపు 300 కిలోల పదార్థాలను వినియోగించినట్లు తెలిపారు. సమయం, ఉష్ణోగ్రత, భద్రతా ప్రమాణాలు, ఇతర పారామితులను తనిఖీ చేసిన తర్వాత, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బృందం సర్టిఫికేట్‌ను జారీ చేసింది.
ఇప్పుడు హార్లీస్ ఇండియా గతం కంటే కన్నా 10 రెట్లు ఎక్కువగా అంటే 3000 కిలోల తేనె కేక్ ను తయారు చేయనుంది. డిసెంబర్ 6న హైదరాబాద్ మాయా కన్వెన్షన్ సెంటర్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. దీనితో పాటే వినోద కార్యక్రమాలు, బేకింగ్ ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు చెప్పారు.












Click it and Unblock the Notifications