Hyderabad: రాంగ్ రూట్ లో వెళ్తున్నారా.. అయితే కేసు నమోదు పక్కా..!
చాలా మంది రోడ్డుపై రాంగ్ రూట్ లో వస్తుంటారు. అదేమంటే.. యూటర్న్ తీసుకోవాలంటే.. 2, 3 కిలో మీటర్లు వెళ్లాలి అందుకే రాంగ్ రూట్ వస్తున్నామని చెబుతారు. కానీ రాంగ్ రూట్ లో ప్రయాణం చాలా డెంజర్. ఇది నేరం కూడా. రాంగ్ రూట్ ప్రయాణం చేస్తే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయినప్పటికీ చాలా మంది రాంగ్ రూట్ లోనే వెళ్తున్నారు. నెలన్నర క్రితం కూకట్ పల్లిలో రాంగ్ రూట్ లో వచ్చిన ఓ వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి మృతి చెందాడు.
సదర్ వ్యక్తి స్కూటీపై వెళ్తున్నారు. అతను యూటర్న్ తీసుకోవాలంటే.. కిలో మీటర్ వెళ్లాలి. కానీ రాంగే రూట్లో వెళ్తే 20 మీటర్లలోనే యూటర్న్ ఉంది. దీంతో అతను వెనక్కు రాంగ్ రూట్ లో వచ్చాడు. యూటర్న్ వద్ద రోడ్డు క్రాస్ చేద్దామనే లోగా.. ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ నడిపే వ్యక్తిదే తప్పు. ఎందుకంటే అతను రాంగ్ రూట్ లో వస్తున్నాడు. రాంగ్ రూట్ ప్రయాణించవద్దని పోలీసులు ఎంత చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదు. దీంతో పోలీసులు కొరఢా ఝులిపించాల్సి వస్తోంది.

రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం రాంగ్ సైడ్ డ్రైవింగ్ తోనే జరుగుతుంటాయని పోలీసులు చెబుతున్నారు. ట్రాఫిక్ నియమాలను మరింత కఠినంగా అమలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తున్న వాహనదారులపై బుధవారం కొరడా ఝలిపారు. నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్, డీసీపీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు సిటీ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించిమూడు గంటల్లో 688 కేసులు నమోదు చేశారు.
అలాగే చాలా మంది కూడా హెల్మెట్ పెట్టుకోవడం లేదు. ఫైన్ పడినా లైట్ తీసుకుంటున్నారు. ఎప్పుడైన డిస్కౌంట్ ఇచ్చినప్పుడు కట్టుకుందాం లే అని అనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications