Hyderabad: కల్తీ ఆహార పదార్థాల తయారీ సెంటర్ పై పోలీసుల దాడులు..!

హైదరాబాద్ లోని చాలా రెస్టారెంట్లు, హోటళ్ల ఫుడ్ కలర్ ఫుల్ గా ఉండేందుకు ఫుడ్ కలర్స్ వాడుతుంటారు. అయితే ఈ కలర్స్ ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫుడ్ కలర్స్ లో నకిలీ వాటిని కూడా తయారు చేస్తున్నారు. వీటిని వాడితే క్యాన్సర్ బారిన పడడం ఖాయమంటున్నారు. తాజాగా నకిలీ ఫుడ్ కలర్స్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పెట్టుకున్నారు.

ఆర్‌జీఐఏ పోలీసులు, శంషాబాద్ పోలీసు స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్‌ఓటి) మంగళవారం సంయుక్తంగా దాడి చేశారు. సతామ్‌రాయ్‌లోని బాలాజీ ఇండస్ట్రీ సమీపంలోని ఒక షాపులో కల్తీ ఆహార పదార్థాలను పట్టుకున్నారు. సింథటిక్ రంగులను స్వాధీనం చేసుకున్నారు. ఎరుపు 250 గ్రాములు, ఆకుపచ్చ 400 గ్రాములు, తెలుపు 150 గ్రాములు, నీరు కలిపిన ఫుడ్ కలర్ 5 లీటర్లు, నకిలీ పసుపు పొడి 35 కిలోలు, కెచప్‌తో సహా గడువు ముగిసిన, కల్తీ చేసిన ఆహార పదార్థాలను సీజ్ చేశారు.

The police arrested a gang that was making adulterated substances

కల్తీ చిల్లి సాస్ 44 లీటర్లు, కల్తీ టొమాటో సాస్ 7 లీటర్లు స్వాధీనం చేసుకున్నారు. కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న రాజేష్ ఉపాధ్యాయ, శ్రీరామ్ తివారీని అరెస్ట్ చేశారు. వారిపై 223, 274, 275 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లో కల్తీ ఆహార పదార్థలు ఏదో ఒక చోట పట్టుబడుతూనే ఉన్నాయి. దీంతో బయట తినాలంటేనే భయపడి పోతున్నారు. మనం ఇళ్లలో వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్, కరం పొడి, పసుపు ను కూడా కల్తీ చేస్తున్నారు.

చిన్న హోటళ్లు, రోడ్డు పక్కన వ్యాపారులు, రెస్టారెంట్లలో కల్తీ పదార్థాలు ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గుత ఏడాది డిసెంబర్‌లో విడుదల చేసిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) గణాంకాల ప్రకారం దేశంలో ఆహార కల్తీ కేసుల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. ఇది చాలా ఆందోళన కలిగిస్తున్న అంశంగా చెప్పుకోవచ్చు. 2022లో భారతదేశంలోని 19 ప్రధాన నగరాల్లో ఆహార కల్తీకి సంబంధించిన 291 కేసులు నమోదయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+